Sunday, January 19, 2025

సెప్టెంబర్లో ఎన్నికల షెడ్యూల్?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల వేడి ఊపందుకుంది. బుధవారం రాష్ట్రానికి కేంద్రం ఎన్నికల సంఘ బృందం రానుంది. బృం దంతో పాటు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి హైదరాబాద్‌కు రానున్నారు. నాలుగు రోజులపాటు హైదరాబాద్‌లోనే సిఇసి బృందం మకాం వేయనుంది. జిల్లా కలెక్టర్లు, ఎస్‌పిలతో ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డీలో సమావేశం నిర్వహించనుంది. సెప్టెంబర్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్? విడుదలయ్యే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం.

ఇప్పటికే పార్టీ రాజకీయ వ్యూహాల్లో మునిగిపోయాయి. ఇప్పుడు అధికారులు కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. దీనికి ఎ న్నికల యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసిం ది. ఎన్నికలకు ముందు అధికార యం త్రాంగం భారీగా న్నే సన్నద్దం కావాల్సి ఉంటుంది. పో లింగ్ స్టేషన్‌ల ఏర్పాటు, ఓటర్ల జాబితా రెడీ చే యడం, ని యోజకవర్గాల వారీగా ఆర్‌వోలను నియమకం. సమస్యాత్మ ప్రాంతాలను గుర్తించి అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం కూడా ఇ ప్పటి నుంచే మొదలు పెట్టాలి. ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి ఓకే చెప్పిన వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈసారి అదనపు జిల్లా కలెక్టర్లకి కూడా బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. 74 మంది డిప్యూటీ కలెక్టర్లు, 14 మంది డిప్యూటీ కమిషనర్లు, 31 మంది అదనపు కలెక్టర్ల లిస్ట్‌ను రెడీ చేసింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న మండల తహసిల్దార్లకు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా విధులు అలాట్ చేయనున్నారు. వీళ్లు నామినేషన్లు స్వీకరించడం, పోలింగ్ సామగ్రిని సరఫరాల చేయడం, పోలింగ్‌బూత్‌ల ఏర్పాటు, ఇవిఎంలు, బ్యాలెట్ పేపర్లు రెడీ చేస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News