- Advertisement -
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం జమ్మూకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను శుక్రవారం విడుదల చేసింది. జమ్మూకశ్మీర్ లో మూడు దశలలో ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
జమ్మూకశ్మీర్ లో మొత్తం 90 స్థానాలలో సెప్టెంబర్ 18న 24 స్థానాలకు, 25న 26 స్థానాలకు, అక్టోబర్ 1న 40 స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. కాగా హర్యానాలో మొత్తం90 స్థానాలకు అక్టోబర్ 1న పోలింగ్ జరుగనున్నది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4న ఒకేసారి వెల్లడించనున్నారు.
- Advertisement -