Thursday, September 19, 2024

ఎన్నికల వేళ..కాంగ్రెస్ కు షాక్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భారీ షా క్ తగిలింది. పిసిసి మాజీ చీఫ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను రాజీనామా చేస్తున్నట్లు ఖర్గేకు లేఖ రాశారు. టిక్కెట్ల కేటాయింపులో బిసిలకు పార్టీ అన్యాయం చేస్తోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. జనగామ టికెట్ విషయంలో పొన్నాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి జనగామ టిక్కెట్టు ఇస్తారని ప్రచారం జరుగుతున్న వేళ అసహనంతో పొన్నాల లక్ష్మయ్య పార్టీ కి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్టీలో తనకు అవమానం జ రిగిందంటూ పొన్నాల బాహాటంగా విమర్శించారు. రాజీనామా లేఖను ఖర్గేకు పంపించిన అ నంతరం పొన్నాల విలేకరుల సమావేశంలో కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్లు భూములు, విల్లాలు ఇస్తే టికెట్లు ఇస్తున్నారని ఆ యన ఆరోపించారు. తెలంగాణలో పార్టీని అమ్మకానికి పెట్టారని ఆయన మండిపడ్డారు. వ్యాపార సంస్థగా పిసిసిని మార్చేశారని పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నా..
బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని పొన్నాల పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పా ర్టీ ఓడిపోయిందని, కానీ, తనను రాజీనామా చేయించి బలి పశువుని చేసిందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. పిసిసి అధ్యక్ష పద వి నుంచి అకారణంగా తొలగించారని, కానీ, ఇ ప్పటివరకు దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఎ లాంటి పదవి ఇవ్వకున్నా తన గళం విప్పలేదని పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. 2018లో కూ డా పార్టీ ఒడిపోయిందని, కానీ అప్పటి నాయకులను మాత్రం రాజీనామా చేయాలని అడగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీలో తాము పరాయి వాళ్లం అయ్యామన్నారు. సర్వేల పేరుతో బిసి నాయకులకు టికెట్లు ఎగ్గొట్టే కుట్ర జరుగుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో లేని వ్యక్తులు గెలుస్తారని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీలో ఉన్న బిసి నేతలు ఓడిపోయే వాళ్లు అనే ముద్ర వేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తన లాంటి సీనియర్ నేత మాట్లాడాలంటే అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిసి నేతలు 50 మంది వచ్చి ఏఐసిసి అపాయింట్ మెంట్ కోరితే అవమానించారని ఆయ న ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ బిసిలకు చిన్న చిన్న వర్గాలకు గుర్తింపు ఇస్తుందని, ఎంపి, ఎమ్మెల్యే పదవులు ఇస్తుందని ఆయన తెలిపారు.
సొంత పార్టీలో పరాయి వాళ్లం అయ్యాం..
పార్టీ గొప్ప సిద్ధాంతాలు రాసుకుంటుందని, ఒక కుటుంబానికి ఒకటే సీటు అంటున్నా, అది అందరికీ వర్తించదని పొన్నాల అన్నారు. ఓ అనామకుడు సర్వేలు చేయడం, మీ పేరు లేదంటే మాలాంటి వాళ్లు కూడా మౌనంగా ఉండాల్సి రావడం బాధకరమని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు పార్టీ పదవులు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి పొ న్నాల ధన్యవాదాలు తెలిపారు. అవమానాలు ప డుతూ పార్టీలో భాగస్వామ్యం అవ్వాలని అనుకోవ డం లేదని వేదన వ్యక్తం చేశారు. తనను రాజీనామా చేయించి బలి పశువుని చేసింది పార్టీ అంటూ పొ న్నాల భావోద్వేగానికి గురయ్యారు. రెం డేళ్లుగా పా ర్టీ భావజాలానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీలో తాము పరాయి వాళ్లం అయ్యామన్నారు.
45 ఏళ్ల రాజకీయ జీవితం నాది
45 ఏళ్ల రాజకీయ జీవితం తనదని, 45 ఏళ్ల తర్వాత ఈ చర్య బాధాకరంగా ఉందని ఆయన తెలిపారు. సుమారు 12 సంవత్సరాల పాటు మంత్రిగా తెలంగాణ తొలి పిసిసి అధ్యక్షుడిగా పని చేశానని పొ న్నాల పేర్కొన్నారు. రాజీనామా పరిస్థితి ఎందుకు వ చ్చిందో మీకు తెలియంది కాదనీ ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందని పొన్నాల కంటతడి పెట్టారు. పేద కుటుం బం నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చానని ఆయన తెలిపారు. వరుసగా మూడు సార్లు గెలిచిన బిసి నేతను అయినా పార్టీలో అవమానం కలిగిందని ఆయన చె ప్పుకొచ్చారు. 40 ఏళ్లలో మూడుసార్లు మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉందని, వచ్చిన మూడు సార్లు కూడా తెలంగాణలో బలంగా లేమని ఆయన చెప్పుకొచ్చారు. పదవుల కోసం తాను రాజీనామా చేయలేదని పొన్నాల తెలిపారు. భవిష్యత్‌పై సమాధానం లేదని, ఎవరెవరో ఏదో ఊహిస్తున్నారన్నారు. భవిష్యత్ గురించి ఏం నిర్ణయం జరగలేదన్నారు.
నమస్తే పెట్టినా రేవంత్ పట్టించుకోలేదు
రెండు సంవత్సరాలుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై పిసిసి అధ్యక్షుడితో మాట్లాడడానికి పలుసార్లు అపాయింట్‌మెంట్ కోరినా ఇవ్వలేదని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా కనిపించినా నమస్తే పెడితే కూడా స్పందించ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతం సామాజిక న్యాయానికి పాతర పడిందన్నారు. సమాజంలో 50 శాతంపైగా ఉన్న బిసిల పట్ల పార్టీలో అత్యంత అవమానకరంగా వ్యవహారిస్తున్నారని ఆయన ఆరోపించారు. జనాభా ప్రకారం సీట్లు కావాలని అడిగితే కనీసం చర్చించిన సందర్భాలు లేవని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. 2001లో తెలంగాణ రాష్ట్రం కోసం 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి పంపిన వారిలో మొదటి సంతకం తానే పెట్టినట్లు ఆయన గుర్తు చేశారు. జనగామ నియోజకవర్గంలో 7 రిజర్వాయర్లు నిర్మించానని, మంత్రిగా పని చేశానని, బిసి నాయకుడైన నన్ను అవమానిస్తుంటే పార్టీ చూస్తూ ఊరుకుందని, గతంలో ఓడిపోయాక ఎమ్మెల్సీ ఇస్తామన్నా తాను తీసుకోలేదని, కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నందుకు ఇన్నాళ్లూ గర్వపడుతున్నానని పొన్నాల పేర్కొన్నారు.
పొన్నాల అనుచరులు ఆయన వెంటే…
పొన్నాల రాజీనామాతో జనగామ కాంగ్రెస్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. పొన్నాలతో పాటే ఆయన అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయి. తన అనుచరులతో చర్చించాకే పొన్నాల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బిసి నాయకుడిగా పొన్నాల లక్ష్మయ్య బలమైన ముద్ర వేశారు. రాష్ట్ర రాజకీయాల్లో బిసి కమ్యూనిటీ ప్రభావం అధికంగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News