Monday, January 20, 2025

ముగిసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమాలు

- Advertisement -
- Advertisement -

పోలింగ్ కేంద్రాల్లో వసతుల ఏర్పాట్లపై దృష్టి

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్స్, అసెంబ్లీ నియోజకవర్గం మాస్టర్ ట్రైనర్స్‌కి శిక్షణ కార్యక్రమాలు చాలా జిల్లాల్లో ముగిశాయి. ప్రధానంగా ఇవిఎం మిషన్లలో బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వివి ప్యాడ్ మిషన్ల అనుసంధానం ప్రక్రియ, వివి ప్యాడ్ మిషన్‌లో పేపర్ అమర్చే విధానం, కంట్రోల్ యూనిట్ ఆపరేట్ చేసే దశల గూర్చి మాస్టర్ ట్రైనర్స్ అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శక ప్రకారం ఏలా ఆపరేట్ చేయాలో క్షుణ్ణంగా వివరించారు. తర్వాత పోలింగ్ రోజు నిర్వహించే మాక్ పోల్ ప్రక్రియ గూర్చి క్షుణ్ణంగా తెలిపి నమూనా పోలింగ్ ఎలా చేస్తున్నారో గమనించారు. సందేహాలు నివ్రృత్తి చేశారు. అనంతరం మీటింగ్ హల్ లో అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్, సెక్టార్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సెక్టార్ అధికారులు మీకు కేటాయించిన పోలింగ్ స్టేషన్‌ల గూర్చి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సెక్టార్ అధికారులు పోలింగ్ ముందుగానే పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి. ఎఆర్వోలు సెక్టార్ అధికారులు మండలలోని గ్రామాలో పంచాయతీ సెక్రటరీలతో సమావేశాలు నిర్వహించి పోలింగ్ స్టేషన్‌ల్లోని సదుపాయాల గూర్చి ఆరా తీయాలని సూచించారు. పోలింగ్ స్టేషన్లలో ఎలక్ట్రిసిటీ, వాటర్ ఫెసిలిటీ, ఫర్నిచర్ ఇతరత్రా సదుపాయాలను గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా ముందుగానే కల్పించుకోవాలి. సెక్టర్ అధికారులు, స్టేషన్ హౌస్ అధికారులు, ప్రిసెండింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసెండింగ్ అధికారులు మంచి సమన్వయంతో పనిచేయాలి. సమస్య ఏదైనా పై అధికారులతో చర్చించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పోలింగ్ రోజు ఓటర్లకు సులభంగా అర్థమయ్యేలా పోలింగ్ స్టేషన్ ఆవరణలో ఓటర్ అసిస్టెంట్ బూత్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలింగ్ స్టేషన్ చుట్టూ 100 మీటర్ల దూరంలో ప్రచారాలు, వాల్ పోస్టర్లు, హోర్డింగ్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి మాస్టర్ ట్రైనర్స్ మీ నియోజకవర్గాల్లో పోలింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహణలో ఏ ఒక్క పాయింట్ కూడా వదలకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ప్రకారం పోలీస్ సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించేలా శిక్షణ అందించాలని సూచించారు.
పక్కా ప్రణాళికతో ఎన్నికల నిర్వహణ : వికాస్‌రాజ్
వచ్చే నెలలో జరిగే సాధారణ ఎన్నికలను సరైన ప్రణాళికతో పారదర్శకంగా నిర్వహించి విజయవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. ఆయన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇటీవల పర్యటించారు. జిల్లా ఎన్నికల అధికారులతో రిటర్నింగ్ అధికారులతో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్ల నిర్వహణ, సంసిద్ధతపై ఆయన సమీక్షించారు. సీ విజిల్ యాప్, స్వీప్ కార్యక్రమాల ద్వారా గ్రామ స్థాయిలోని ప్రజల వరకు తీసుకెళ్లి ఆవగాహన కల్పించాలన్నారు. చెక్ పోస్టుల్లో వాహనాల తనిఖీలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని. పట్టుబడిన వాటిని ఎన్నికల నియమావళి మేరకు సీజ్ చేయాలని. ఎన్నికల సమయంలో సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా పట్టుబడిన వాటిపై బృందాల ద్వారా సమీక్షిం చుకొని త్వరగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News