మన తెలంగాణ / హైదరాబాద్: సాధారణంగా కొన్ని సినిమాల్లో ఒక పాటలో కనిపించిన డ్యాన్సర్లే… మరో పాటలో కనిపిస్తుంటారు.. కాస్టూమ్స్ మాత్రమే.. తేడా… ప్రస్తుతం ఎన్నికల్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం ఒక పార్టీ తరపున ప్రచారం చేస్తున్న కార్యకర్తలు( అద్దె ప్రాతిపదికన) మధ్యాహ్నం మరో పార్టీ తరపున, సాయంత్ర ఇంకో పార్టీ తరపున ప్రచారం చేస్తున్న సంఘటలు చోటు చేసుకుంటున్నాయి. వీరిలో అత్యధికంగా అడ్డా కూలీలు, ఇళ్ళల్లో పని చేసే వర్కర్లే అధికంగా ఉండటం విశేషం. వీరికి ఆయా పార్టీల తరుపున ప్రచారం చేసిందుకుగాను రూ.300 నుంచి 500 వరకు ఆయాపార్టీల నిర్వహకులు చెల్లిస్తున్నట్లు సమాచారం.
పలు పార్టీల తరపున ప్రచారం చేస్తునందుకుగాను వారు రోజుకు ఎంత లేదన్నా రూ.1500 నుంచి రూ. 2000 వరకు సంపాదిస్తున్నారు. అయితే ఇందుకు కొన్ని ఏజెన్సీలు ప్రత్యేకంగా పని చేస్తున్నట్లు తెలిసింది. సదరు ఏజెన్సీలు అడ్డా కూలీల వద్దకు వెళ్ళి ముందుగానే వారితో ఒప్పందం చేసుకుంటున్నారు. ప్రతి రోజు ఉదయం పనికి వెళ్ళి రెక్కలు ముక్కలు చేసుకునే బదులు.. కేవలం సదరు పార్టీల జెండాలు మోసినందుకే ఇంత మొత్తంలో సంపాదిస్తుండటంతో వారు పార్టీల తరుపున ప్రచారం చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. అదే విధంగా గృహ నివాసాల్లో పని చేసే వర్కర్లు కూడా త్వరత్వరగా వారి విధులను ముగించుకుని పార్టీల తరపున ప్రచారం చేసేందుకు వెళుతున్నారు. కొన్ని ఇళ్ళల్లో పనిచేసేందుకు ఆలస్యంగా రావడంతో సదరు గృహ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే.. ఈ ఎన్నికల ప్రచారాల్లోనే కదా అమ్మా నాలుగు రాళ్ళు సంపాదించుకునేదని సర్ధి చెబుతుండడంతో.. చేసేది ఏమీ లేక సదరు గృహ యజమానుల మౌనంగా తమ అంగీకారం తెలుపుతున్నారు.
బాధ్యత ఎవరిది ?
ఎన్నికల ప్రచారంలో పార్టీ వ్యతిరేకం వర్గం చేసే రాళ్ళ దాడులు, యాక్సిడెంట్లు, విద్యుత్ ప్రమాదాలు, హోర్డింగ్‌లు వీదపడి గాయాలు పాలు కావడం.. తదితర సంఘనలు చోటు చేసుకుంటే భాద్యత ఎవరు వస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పార్టీ నిర్వహకులు ఇచ్చే డబ్బుకు ఆశపడి పార్టీల తరపున వెళుతున్న వారు ఆలోచించుకోవాలని చెబుతున్నారు. ప్రమాదాల జరిగినప్పుడు తాము మోసే జెండా ప్రతినిధుల సైతం పక్కకు తప్పుకుంటారే కాని, ఆదుకునే ప్రయత్నం చేయరనే విమర్శలు వస్తున్నాయి.