Sunday, January 19, 2025

కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని బిసి సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్ర భాకర్ అన్నారు. సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలు ఆదివారం రవీంద్రభారతిలో జరిగాయి. ఈ సందర్భంగా పాపన్న చిత్రానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భట్టి విక్రమార్క పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కులగణనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. గణనకు ఇప్పటికే ప్రభు త్వం జీఓ ణౌఇచ్చి 150కోట్లు కేటాయించిందన్నారు. ప్రజా ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగానే రా బోయే స్థానిక సంస్థల ఎన్నికలు కులగణన చేసిన తర్వాతనే నిర్వహిస్తామని, త్వరలోనే కుల గణన కార్యక్రమం జరుగుతుందని, దానిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. గణన కార్యక్రమం ఏ ఏజెన్సీ లేదా ఏ డిపార్ట్‌మెంట్‌తో చేయించాలన్నదానిపై చర్చ జరుగుతోందని, మరో వారం పది రోజుల్లో కులగణన సంబంధించి జరిగిన పేపర్ వర్క్‌ను బయటపెడతామని మంత్రి అన్నారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు సర్వాయి పాపన్న స్ఫూర్తి గాథలు తెలియజెప్పాలని అన్నారు. ఆయన పుట్టిన సర్వాయి పేట, కిలాశాపూర్ లను పర్యాటకంగా అభివృద్ధ్ది చేస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు.

పాపన్న గౌడ్ పర్యాటక కేంద్రానికి రూ.4.70 కోట్లు కేటాయిస్తూ జీఓ విడుదల చేశామని వివరించారు. పాపన్న గౌడ్ పర్యాటక కేంద్ర నిర్మాణ బాధ్యత మంత్రి పొన్నం ప్రభాకర్ చూసుకుంటారని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పాపన్న గురించి ప్రజలు తెలుసుకునేలా పాకెట్ పుస్తకాలను ముద్రిస్తామన్నారు. నగరం నడిబోడ్డున పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన స్థలం చూసి, దానికి కావల్సిన ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. రాజ్యాంగం, చట్టాలు లేని రోజుల్లోనే ప్రజల హక్కుల కోసం సర్వాయి పాపన్న పోరాడారని ఆయన తెలిపారు. మొఘల్ సైన్యాన్ని సైతం ఎదిరించి నిలబడిన వీరుడు పాపన్న అని కొనియాడారు. సర్వాయి పాపన్న జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడ్డారని తెలిపారు. గోల్కొండ కోటలను కూడా కొల్లగొట్టిన సర్వాయి పాపన్న జీవితం అందరికీ ఆదర్శమైందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యానికి కూడా సర్వాయి పాపన్న ఆలోచనలే మార్గదర్శకం అని అన్నారు.

బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం సర్వాయి పాపన్న పాటుపడ్డారని వెల్లడించారు. పిల్లలను విద్యతోనే ప్రయోజకులను చేయవచ్చనే ఆలోచనతో ప్రభుత్వం 5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందని, అలాగే గ్రామీణ విద్యార్ధులకు అందుబాటులో ఉండేలా ప్రతీ నియోజకవర్గంలో నాలెడ్జ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. . అలాగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని నగరం నడిబోడ్డున పెట్టాలని చాలా మంది అడుగుతున్నారని, మ ంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో బడుగు బలహీనవర్గాలను ఆలోచింపచేసే రోజు ఇది అని అన్నారు. నేడు ప్రజాస్వామ్య పద్ధతిలో పెన్ను ద్వారా పోరాటం, ఓటు ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు సాగాలని మంత్రి వివరించారు. సర్దార్ సర్వాయి పాపన్న పోరాడిన విధానాన్ని మార్గదర్శకత్వంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి మహేశ్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, బిసి సంక్షేమ శాఖ అదికారులు, బిసి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News