- Advertisement -
టోక్యో : మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురై జపాన్‌లో విషాద ఛాయలు ఆవరించినప్పటికీ జపాన్ పార్లమెంట్ లోని ఎగువ సభకు ఆదివారం ఎన్నికల ఘట్టం ప్రారంభమైంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు అబే హత్యకు గురికావడం దేశానికి షాక్ తగిలింది. భద్రతా లోపాలపై అనేక సందేహాలు వెలువడుతున్నాయి. ఆదివారం నాటి ఎన్నికలు కొత్త అర్థాన్ని ఇచ్చాయి. అన్ని రాజకీయ పార్టీల నేతలు స్వేచ్ఛగా ప్రసంగించడం తమ హక్కుగా పేర్కొంటూ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా హింసాకాండకు చోటివ్వరాదని స్పష్టం చేశారు. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ బలహీనమైన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ షింజో అబే పై సానుభూతి ఓట్లు కిషిడాకు పార్లమెంట్ ఎగువ సభలో ఉన్న మెజార్టీ కన్నా భారీ విజయాన్ని అందిస్తాయని మీడియా సర్వేలు చెబుతున్నాయి.
- Advertisement -