- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన 13 రాజ్యసభ స్థానాలకు మార్చి 31న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటించింది. అసోం, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, నాగాలాండ్, త్రిపుర నుంచి రాజ్యసభ సభ్యులు ఏప్రిల్ 2న రిటైర్ కానుండగా, పంజాబ్ నుంచి ఐదుగురు సభ్యులు ఏప్రిల్ 9న రిటైర్ కానున్నారు. పంజాబ్‌లో 5 సీట్లు, కేరళలో 3 సీట్లు, అసోంలో 2 సీట్లు, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపురల నుంచి ఒక్కో సీటు ఖాళీ కానుంది. పదవీకాలం ముగుస్తున్న రాజ్యసభ సభ్యులలో ఎకె ఆంటోని(కేరళ), ఆనంద్ శర్మ(హిమాచల్), ప్రతాప్ సింగ్ బజ్వా, నరేష్ గుజ్రాల్(పంజాబ్) వంటి ప్రముఖులు ఉన్నారు.
Elections to 13 Rajya Sabha Seats on March 31st
- Advertisement -