Tuesday, November 5, 2024

ఎలక్ట్రిక్ టూ వీలర్లు రిస్కే..

- Advertisement -
- Advertisement -

Electric 2 wheelers are not safe

దీర్ఘకాలంలో సేల్స్‌పై ప్రభావం
ప్రస్తుతం లభిస్తున్న మోడళ్లు ఖరీదైనవి: సర్వే

మన తెలంగాణ/ హైదరాబాద్: ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. కానీ ఇటీవల ఈ వాహనాల అగ్ని ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఇన్ఫోటైన్మెంట్ యాప్ వే2న్యూస్ చేపట్టిన సర్వేలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు సురక్షితం కాదని ఎక్కువమంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ- టూ వీలర్లు ఖరీదైనవని, తక్కువ ధరలో లభిస్తే రైడ్‌కు సిద్ధమని, అధిక దూరం వెళ్లాల్సిందేనని ప్రజలు కోరుకుంటున్నారని సర్వే చెబుతోంది. సర్వేలో 57 శాతం మంది ఎలక్ట్రిక్ టూ వీలర్లు సురక్షితం కాదని స్పష్టం చేశారు. ఈ- టూ వీలర్ల అగ్ని ప్రమాదాలు దీర్ఘకాలంలో వాటి అమ్మకాలపై ప్రభావం చూపుతాయని 1.14 లక్షల మంది (75.9 శాతం) అభిప్రాయపడ్డారు. ఆసక్తికర విషయం ఏమంటే ఈ ఏడాది మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో -టూ వీలర్ల అమ్మకాలు 1 శాతం తగ్గాయి.

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, 2022 మార్చిలో దేశవ్యాప్తంగా 49,642 యూనిట్లు సేల్ కాగా, ఏప్రిల్‌లో ఈ సంఖ్య 49,166 యూనిట్లకు పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి(ఎలక్ట్రిక్ వెహికిల్)ల పట్ల ప్రజల ఆలోచనపై చేపట్టిన సర్వేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి 1.50 లక్షల మంది పాల్గొన్నారు. వీరిలో చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు 92.5 శాతం మంది ఉన్నారు. భవిష్యత్ మాత్రం ఎలక్ట్రిక్ వాహనాలదేనని, అయితే ఇవిలు ప్రస్తుతం చాలాఖరీదైనవని మూడింట రెండొంతుల మంది అభిప్రాయపడ్డారు. రూ.50 వేల లోపు ధరలో లభించే మోడళ్లకే అత్యధికులు మొగ్గు చూపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News