Wednesday, January 22, 2025

ప్రజావాణి వల్ల అందిన ఎలక్ట్రికల్ ఆటో

- Advertisement -
- Advertisement -

ఆనందం వ్యక్తం చేసిన లబ్దిదారుడు మేథరి అశోక్
ఎలక్ట్రికల్ ఆటోలో ప్రయాణించిన చిన్నారెడ్డి, దివ్య దేవరాజన్

మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి ప్రజావాణి వల్ల హైదరాబాద్‌లోని ఎర్రగడ్డకు చెందిన ఎస్సీ యువకుడు మేథరి అశోక్ కు స్వయం ఉపాధి కోసం ఎలక్ట్రికల్ ఆటో సకాలంలో అందింది. శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి ఎలక్ట్రికల్ ఆటోను అశోక్ తీసుకువచ్చి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ లను ఎలక్ట్రికల్ ఆటోలో ఎక్కించుకుని అశోక్ సవారీ చేశారు. ఎలక్ట్రికల్ ఆటో పొందిన మేథరి అశోక్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

హైదరాబాద్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ ద్వారా స్వయం ఉపాధి కోసం మేథరి అశోక్‌కు ఎలక్ట్రికల్ వాహనం కొనుగోలు చేసేందుకు రుణం మంజూరైంది. అయితే వాహనాల డీలర్ వద్ద ఎలక్ట్రికల్ ఆటో రిలీజ్ కోటా మించి పోవడం వల్ల ఆటో ఇవ్వడం కుదరదని డీలర్ చెప్పారు. దీంతో అశోక్ ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమంలో తన పరిస్థితిని వివరిస్తూ మూడు వారాల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ రవాణా శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ఎలక్ట్రికల్ ఆటోను రిలీజ్ చేయించారు. ఎలక్ట్రికల్ ఆటో ద్వారా రోజుకు కనీసం వేయి రూపాయలు సంపాదించుకుంటున్నట్లు మేథరి అశోక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డికి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ కు అశోక్ ధన్యవాదాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News