Wednesday, January 22, 2025

విజయవాడలో పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

Electric bike battery exploded in Vijayawada

అమరావతి: ఎపిలోని విజయవాడ సూర్యారావుపేటలో విషాదం చోటుచేసుకుంది. విజయవాడ గులాబీపేటలో శనివారం ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. శివకుమార్ అనే వ్యక్తి నిన్ననే కొత్త ఎలక్ట్రిక్ బైకు కొనుగోలు చేశాడు. రాత్రి తన ఇంట్లోని బెడ్ రూంలో బైక్ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాడు. ఈ క్రమంలోనే తెల్లవారుజామున బ్యాటరీ పేలి ఇంట్లో భారీగా మంటలు చెలరేగాయి. శివకుమార్,భార్య, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. గమనించిన స్థానికులు ఇంటి డోర్లను పగలగొట్టి లోపలికి వెళ్లారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా శివకుమార్ మృతిచెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారం తో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News