Monday, December 23, 2024

మార్కెట్లోకి ఎలక్ట్రిక్ బైక్ ‘హోప్ ఆక్సో’

- Advertisement -
- Advertisement -

Electric bike 'Hope Oxo' in the market

న్యూఢిల్లీ : హోప్ ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ హోప్ ఆక్సోను విడుదల చేసింది. ఈ బైక్ ఒక్కసారి చార్జింగ్ చేస్తే 150 కి.మీ ప్రయాణిస్తుంది. ఆక్సో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. ఇవి జియో-ఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, రైడ్ స్టాటిస్టిక్స్ వంటి ఫీచర్లను కూడా పొందుతాయి. దీని ప్రారంభ ధర రూ.1,24,999గా నిర్ణయించారు. ఈ బైక్ ఆక్సో, ఆక్సో ఎక్స్ అనే రెండు వేరియంట్లలో విడుదల చేశారు. దీనిలో మొత్తం 4 రైడింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎకో, పవర్, స్పోర్ట్, టర్బో ఉన్నాయి. అయితే ఈ 4 మోడ్‌లు దాని టాప్ వేరియంట్ ఆక్సో ఎక్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే ఆక్సో వేరియంట్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News