మంత్రి కెటిఆర్‌కు వినతిపత్రం అందజేసిన రెడ్‌కో చైర్మన్ సతీష్ రెడ్డి
సానుకూలంగా స్పందించిన మంత్రి కెటిఆర్
పర్యావరణ పరిరక్షణ కోసం
ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాం
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జీంగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు చేయాలని కోరుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌కు పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ (రెడ్కో) చైర్మన్ వై.సతీష్ రెడ్డి బుధవారం వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టిఎస్‌ఐఐసీకి చెందిన స్థలాలతో పాటు ఐటీ సెక్టార్, టిహబ్, టి వర్క్ చెందిన స్థలాల్లో చార్జీంగ్ కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని మంత్రి కెటిఆర్‌కు సతీష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. చార్జీంగ్ స్టేషన్ల ఏర్పాటుకు హైదరాబాద్‌లోని టిఎస్‌ఐఐసీకి చెందిన 28 ప్రాంతాలు అనువుగా ఉన్నాయని మంత్రి కెటిఆర్‌తో సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. పరిశ్రమల శాఖ ఆ స్థలాలను ఇస్తే ఆయా ప్రాంతాల్లో టిఎస్ రెడ్‌కో తరపున నేషనల్ క్లీన్ ఎనర్జీ ప్రోగ్రాం స్కీం కింద డిసి ఫాస్ట్ చార్జీంగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సతీష్‌రెడ్డి కెటిఆర్‌తో తెలిపారు. దీనివల్ల ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపేందుకు అవకాశం కలుగుతుందని మంత్రి కెటిఆర్‌తో రెడ్‌కో చైర్మన్ సతీష్ రెడ్డి వివరించారు. దీనిపై మంత్రి కెటిఆర్ సానుకూలంగా స్పందించారు.
పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం కాలుష్య నియంత్రణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కెటిఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి కెటిఆర్ సతీష్‌రెడ్డితో పేర్కొన్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ప్రజలు అవగాహన కల్పిస్తోందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దేశంలో మొదటిసారిగా హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు.
హైదరాబాద్‌లో 292 ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు మంత్రి కెటిఆర్ చొరవతోనే ఫిబ్రవరిలో హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్యక్రమం జరగబోతోందని సతీష్ రెడ్డి అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పటికే హైదరాబాద్ లో 292 ఈవీ చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు సతీష్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లోని పబ్లిక్ ప్రదేశాల్లో ఎయిర్ పోర్టులు, రైల్వేస్టేషన్లు, మెట్రో స్టేషన్లు, మున్సిపల్ పార్కింగ్ ప్రదేశాలు, బస్ డిపోలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో చార్జీంగ్ స్టేషన్ల ఏర్పాటుకు రెడ్‌కో ప్రయత్నాలు చేస్తోందని వై.సతీష్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,301 ప్రాంతాలను రెడ్‌కో గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. రెడ్‌కోకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర మంత్రి కెటిఆర్‌లకు సతీష్‌రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.