Sunday, January 19, 2025

రోడ్డు మధ్యలో కరెంట్ స్తంభం.. నిర్లక్ష్యానికి నిదర్శనం

- Advertisement -
- Advertisement -

కాసిపేటః ఏదైన అభివృద్ది పనిని చేపట్టి నట్లయితే అది పది కాలాలు పటిష్టంగా, అందరికి అనువైట్లుగా ఉండాలి. కాని కాసిపేట మండలంలోని లంబాడితండా(కె) పంచాయితీ పరిదిలో అభివృద్ది పేరట వేసిన రోడ్డు మధ్యలో కరెంట్ స్థంబం ఉండడంతో రోడ్డు నిరుపయోగంగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. లక్షలాది రుపాయలు వెచ్చించి లంబాడితండా(కె) పంచాయితీలో సిమెంట్ రోడ్డు పనులు చేపట్టి రోడ్డు నిర్మించారు. రోడ్డు మద్యలో కరెంట్ స్థంబం వచ్చినప్పటికి స్థంబంను అలాగే ఉంచి రోడ్డు వేయడం విమర్శల పాలవుతుంది. కరెంట్ స్థంబం రహదారికి మద్యలో రావడంతో ఆ రోడ్డుపై కారు, ఆటో కూడా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.

లక్షలాది రుపాయలు వెచ్చించి నిర్మించిన రోడ్డు విషయంలో ఇటు పంచాయితీ కానీ, అటు విద్యుత్తు శాఖ కానీ పట్టించుకోక పోవడంతో రోడ్డు మద్యలోనే కరెంట్ స్థంబం ఉండి రవాణాకు ఇబ్బందులు కలుగ చేస్తుందని గ్రామస్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇటివలనే రోడ్డు వేసిన రోడ్డు కూడా శిథిలావస్థకు చేరుకుందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైన విద్యుత్తు అధికారులు, పంచాయితీ కాని పట్టించుకొని స్థంబం రోడ్డ మద్య నుండి పక్కకు తొలగించి నట్లయితే రోడ్డు అందరికి ఉపయోగ పడుతుందని గ్రామస్తులు కోరుచున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News