Thursday, January 23, 2025

దేశవ్యాప్తంగా రూ.50 కోట్లతో ఫ్రాంక్లిన్ ఇవి విస్తరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ ఫ్రాంక్లిన్ ఇవి దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. డిసెంబర్ నాటికి 200 షోరూంలను ఏర్పాటు చేయాలనే లక్షంతో ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడులో కంపెనీ ఇప్పటికే అడుగుపెట్టింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, వైజాగ్, విజయవాడ వంటి 30 నగరాల్లో మొత్తం 54 షోరూంలను నిర్వహిస్తోంది. ఒక్క హైదరాబాద్‌లోనే 14 షోరూంలు ఉన్నాయి. 2021లో కంపెనీ అమ్మకాలను ప్రారంభించింది. రెండేళ్లలోనే 6,000 పైచిలుకు కస్టమర్లను సొంతం చేసుకున్నామని ఫ్రాంక్లిన్ ఇవి ఫౌండర్ డాక్టర్ శశిధర్ కుమార్ తెలిపారు.

కో-ఫౌండర్లు రంజిత్ కుమార్, నవీన్ కుమార్‌తో కలిసి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘కొత్తగా ఫ్రాంచైజీ కోసం 30 మంది ఔత్సాహికులతో చర్చలు జరుగుతున్నాయి. నేపాల్, బంగ్లాదేశ్, ఆఫ్రికాకు ఎగుమతులు చేస్తున్నాం. మరిన్ని దేశాల్లో అడుగు పెడతాం. ఈ ఏడాది చివరికల్లా నెలకు 3,000 యూనిట్ల అమ్మకాల స్థాయికి చేరుకోవాలన్నది లక్ష్యం. లక్ష్యాన్ని చేరుకోవడానికి రూ.50 కోట్లతో విస్తరణ చేపడుతున్నాం. కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు’ అని వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల్లో డ్యూయల్ బ్యాటరీతో తయారైన తొలి మోడల్ ఇదే. ఒకసారి చార్జింగ్‌తో 200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News