Monday, December 23, 2024

త్వరలోనే యువతులకు ఎలక్ట్రికల్ స్కూటీలు!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: యువతులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్న ప్రభుత్వం త్వరలోనే యువతులకు ఎలక్ట్రికల్ స్కూటీలను ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల అనంతరం యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చదువుకునే యువతులకు ఆరు నెలలోపు ఎలక్ట్రికల్ స్కూటీలు అందిస్తామని పేర్కొంది. ఈ పథకానికి 18 సంవత్సరాలు నిండిన యువతులందరూ అర్హులే. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, రెసిడెన్స్ ప్రూఫ్, ఇన్‌కం సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్‌లను రెడీగా ఉంచుకోవాలని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
దరఖాస్తు చేసుకునే విధానం…
ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ (https://telangana.gov.in)లోకి వెళ్లాలి. హోంపేజీలో త్వరలోనే ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంచనున్నారు. అప్పుడు స్కూటీ స్కీం అప్లై విధానం క్లిక్ చేయగానే, దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. అందులో దరఖాస్తుదారుల వివరాలు, అడ్రస్ ఎంటర్ చేయాలి. తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.  అర్హతలు, పత్రాలను పరిశీలించి, అన్నీ సరిగానే ఉన్నాయని తేలితే, వారిని అర్హులుగా ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. అనంతరం స్కూటీలను అందచేయనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News