Friday, December 20, 2024

కర్నూల్ లో విషాదం.. 15 మంది చిన్నారులకు గాయాలు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. కర్నూల్ సమీపంలోని చిన్న టేకూర్ లో విద్యుదాఘాతం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రథోత్సవం నిర్వహిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం సంభవించింది. ఉగాది ఉత్సవాలు సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన చిన్నారుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News