Wednesday, January 22, 2025

రెండేళ్లలో దిగిరానున్న ఎలక్ట్రిక్ కార్ల ధరలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఇవి) ధరలు త్వరలోనే తగ్గుతాయి. ఇవి వచ్చే రెండు రోజులలో పెట్రోలు నడిచే కార్ల ధరలతో సమానం అవుతాయని కేంద్ర రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గురువారం తెలిపారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా స్పందిస్తూ ఈ విషయం వెల్లడించారు. ఎంపిలంతా ఈ ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసి కాలుష్య నివారణకు వీలు కల్పించాలని మంత్రి కోరారు. పార్లమెంట్ ఆవరణలో త్వరలోనే ఈ వాహనాల ఛార్జీంగ్ స్టేషన్ ఏర్పాటు అవుతుంది. అప్పటి నుంచి అంతా ఈ వాహనాలనే వినియోగించుకోవల్సి ఉంటుందన్నారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఎక్కువ స్థాయిలో ఉన్నాయనే విషయాన్ని మంత్రి అంగీకరించారు. అయితే ఈ రకం ద్వి, త్రి చక్ర వాహనాలు, నాలుగు చక్రాల కార్లు ఇతర వాహనాల ధరలు వచ్చే రెండేళ్లలో తగ్గుతాయని, ఇవి పెట్రోలుతో నడిచే వాహనాల స్థాయికి చేరుకుంటాయని సభ్యులకు తాను హామీ ఇస్తున్నట్లు తెలిపారు.

అంతర్జాతీయ పరిణామాలతో ఇప్పుడు ఇంధన ధరలు పెరగడంతో పలు కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ గడ్డు స్థితిని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఈ తరుణంలో భవిష్య అవసరాల కోసం అంతా ప్రత్యామ్నాయ ఇంధనం అయిన గ్రీన్, హైడ్రోజన్, విద్యుత్, ఇథనాల్, మిథనాల్, బయోడీజిల్, బయో ఎల్‌ఎన్‌జి, బయోసిఎన్‌జి వాడకం ఆధారంగా నడిచే వాహనాల తయారీకి వీటిని అందుబాటులోకి తేవడానికి అన్ని యత్నాలు సాగుతున్న విషయాన్ని తాను సభ దృష్టికి తీసుకువస్తున్నట్లు మంత్రి వివరించారు.

Electric Vehicles Cost to equal to petrol Cars in 2 years

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News