Monday, December 23, 2024

కోతుల కోసం విద్యుత్ తీగను అమర్చితే… రైతు ప్రాణం తీసింది…

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: కోతుల బెడద నుంచి తప్పించుకోవడానికి ఓ రైతు చేను చుట్టు విద్యుత్ తీగలను ఏర్పాటు చేశాడు.ఆ విద్యుత్ తీగలకు తగిలి మరో యువ రైతు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. హైదరాసాయి పేటకు చెంది జానిమియా అనే రైతుల పొలం పనులు జీవనం సాగిస్తున్నాడు. జానిమియా కుమారుడు యాకూబ్ పాషా ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ వ్యవసాయంలో తండ్రికి సహాయంగా ఉంటాడు. సోమవారం మధ్యాహ్నం మోటారు ఆన్ చేసేందుకు పొలం దగ్గరకు వెళ్లాడు. వెంకన్న అనే రైతు కోతుల బెడద తట్టుకోలేక పొలం చుట్టు విద్యుత్ తీగలు అమర్చాడు. యాకూబ్ పొలం వద్దకు వెళ్తున్నప్పుడు విద్యుత్ తీగలు తగిలి అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వెంకన్న, అతడి కుమారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాకూబ్‌కు సంవత్సరం వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News