Friday, November 22, 2024

వర్షాల నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలి

- Advertisement -
- Advertisement -

అంతరాయాలు ఏర్పడినప్పుడు వాటిని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలి
జిల్లాలోని కంట్రోల్ రూలతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలి
అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన సిఎండి రఘుమారెడ్డి

Electrical staff should be at headquarters in Heavy rains
మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.రఘుమా రెడ్డి, జోన్, సర్కిళ్ల చీఫ్ జనరల్ మేనేజర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశం లో వివిధ జిల్లాల, సర్కిళ్ల పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థపై వర్ష ప్రభావాన్ని గురించి చర్చించారు. గ్రేటర్ పరిధిలో విద్యుత్ సరఫరా సాధారణంగానే ఉందని, గ్రామీణ జిల్లాలు/ సర్కిళ్ల పరిధిలో 13 విద్యుత్ స్తంభాలు నేలకొరగటం, ఐదు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని, వీటి మినహా సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఎలాంటి అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని సిఎండి జి రఘుమా రెడ్డి తెలిపారు.

డిజాస్టర్ మేనేజ్‌మ్మెంట్ బృందాలు, విద్యుత్ శాఖ అధికారులు అందుబాటులో…..

ప్రస్తుత పరిస్థుతుల దృష్ట్యా డిజాస్టర్ మేనేజ్‌మ్మెంట్ బృందాలు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలని, వర్షం అధికంగా కురుస్తున్న సమయాల్లో విద్యుత్ అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా తగిన సామగ్రితో (ప్రతి సెక్షన్ ఆఫీస్‌లో 30 పోల్స్, ప్రతి డివిజన్‌లో అదనంగా 20 మంది తాత్కాలిక సిబ్బంది, కండక్టర్) సంబంధిత సబ్ స్టేషన్లు/ ఫ్యూజ్ కాల్ ఆఫీస్‌లో ఉండి సరఫరా తీరును పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. ఎక్కడైనా అంతరాయాలు ఏర్పడినప్పుడు వాటిని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని ఆయన సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు జిహెచ్‌ఎంసి కంట్రోల్ రూమ్/ జిల్లాల్లోని కంట్రోల్ రూలతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు.
వినియోగదారులు, ప్రజలు భద్రతా చర్యలు పాటించాలి

వర్షాల నేపథ్యంలో విద్యుత్ వినియోగదారులు, ప్రజలు తగిన భద్రతా చర్యలు పాటించాలని సిఎండి రఘుమా రెడ్డి కోరారు. క్రిందకు వంగిన, కూలిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని, వాటిని తాకటం చేయరాదని ఆయన సూచించారు. కింద పడ్డ/ వేలాడుతున్న విద్యుత్ వైర్లను తాకడం, వాటిమీద నుంచి వాహనాల తో డ్రైవ్ చేయడం, వైర్లను తొక్కడం చేయరాదన్నారు. రోడ్ల మీద నిల్వ ఉన్న నీళ్లలో విద్యుత్ వైర్లు గానీ, ఇతర విద్యుత్ పరికరాలు మునిగి ఉన్నట్లయితే ఆ నీటిలోకి పోరాదన్నారు. విద్యుత్ స్తంభాలకు, స్టే వైర్లకు పశువులను కట్టరాదని, వర్షం పడేటప్పుడు, తగ్గిన తరువాత పశువులను విద్యుత్ వైర్లకు, ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా తీసుకెళ్లాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా వ్యవహారించాలని ఆయన సూచించారు. వర్షం కురిసేటప్పుడు విద్యుత్ లైన్లు ఉన్న చెట్ల కింద నిలబడటం, చెట్లు ఎక్కడం చేయరాదన్నారు. అపార్ట్‌మెంట్ సెల్లార్లలో ఉన్న మీటర్ ప్యానెల్ బోర్డులను మొదటి అంతస్తులోకి మార్చుకోవాలని ఆయన సూచించారు.

విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్…

విద్యుత్ సమస్యకు సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 నెంబర్‌లకు గానీ, సంస్థ మొబైల్ ఆఫ్, ట్విట్టర్, పేస్‌బుక్‌ల ద్వారా ఫిర్యాదు చేయాలని సిఎండి జి.రఘుమా రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News