Thursday, January 23, 2025

ఎసిబి వలలో విద్యుత్ ఎడిఇ

- Advertisement -
- Advertisement -

రూ.50వేలు లంచం తీసుకుంటుండ పట్టుకున్న పోలీసులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః అదనపు ఎలక్ట్రిసిటీ లోడ్, డిటిఆర్ మంజూరు చేసేందుకు డబ్బులు తీసుకుంటుండగా టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ ఎడిఈ, ఆర్టిజన్‌ను ఎసిబి అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి అధికారుల కథనం ప్రకారం… సైబర్ సిటీ సర్కిల్, కొండాపూర్ డివిజన్, కెపిహెచ్‌బి సబ్ డివిజన్ అడిషనల్ ఇంజనీర్ బి. ఉదయ్‌కుమార్ అదనపు లోడ్ మంజూరు కోసం సంప్రదించిన కాంట్రాక్ట్ సూపర్‌వైజర్ తాళ్ల ప్రవీణ్‌ను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

కేపిహెచ్‌బికి చెందిన వి.పుష్పలతకు డిటిఆర్ ఇన్‌స్టాలేషన్ కూడా అనుమతి కోరగా డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు రూ.50,000 ఇచ్చి పంపించారు. ఎడిఈని సంప్రదించగా డబ్బులు కెపిహెచ్‌బి సర్కిల్‌లో ఆర్టిజన్‌గా పనిచేస్తున్న కోటి రెడ్డికి ఇవ్వాల్సిందిగా చెప్పాడు. అతడి సూచనల మేరకు కోటి రెడ్డికి డబ్బులు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరికి నిర్వహించిన కెమికల్ పరీక్షలో పాజిటివ్ రావడంతో ఎసిబి అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News