Saturday, December 21, 2024

వ్యవసాయి కూలీకి రూ.1.22 లక్షల కరెంటు బిల్లు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఓ వ్యవసాయి కూలీకి ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు చూస్తే షాక్ తిట్టారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం చినరావుపల్లి గ్రామానికి చెందిన పప్పుల ముకందరావు అనే వ్యవసాయ కూలీకి రూ.1,22,206 కరెంటు బిల్లు రావడంతో అవాక్కయ్యాడు. ఒక బల్బు, ఒక ఫ్యాన్‌కు అంత కరెంటు బిల్లు వస్తుందని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కరెంటు బిల్లు కడుదామని స్థానిక మీసేవకు వెళ్లాడు. రూ.1.22 లక్షల బిల్లు ఉందని మీ సేవ నిర్వహకులు చెప్పడంతో ముకందరావు మూర్చబోయాడు. వెంటనే విద్యుత్ అధికారులను అతడు కలిశాడు. యూనిట్లు జంప్ కావడంతోనే అంత బిల్లు వచ్చిందని అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్యతో బిల్లు ఎక్కువగా వచ్చిందని స్థానిక ఎఇ వివరణ ఇచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News