తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యదిర్శ అంజయ్య
హైదరాబాద్ : విద్యుత్ సంస్థల ప్రవేటీకరణ కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న విద్యుత్ సవరణ చట్టం 2021ను వెంటనే వెనుక్కు తీసుకోవాలని తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జెన్‌కోశాఖ ఏకగ్రీవంగా తీర్మానించింది. విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జెన్‌కో విభాగం సర్వసభ్య సమావేశం విఏవోఏటీ రాష్ట్రప్రధాన కార్యదర్శి అంజయ్య ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి విఏవోటీ ప్రతినిధి అనురాధ ప్రత్యేక ఆహ్వానితులుగా హజరయ్యారు. విద్యుత్ సంస్థలను కాపాడుకునేందుకు మనమందరం సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని అంజయ్య పిలపునిచ్చారు.
ఒక వైపు సంస్థల అభివృద్దికి నిరంతరం కృషి చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలను అసోసియేషన్ దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. అనంతం 2022 సంవత్సరానికి గాను వీఏవోఏటీ జెన్‌కో శాఖ కొత్తతత కార్యర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా ఎం.మధుసూదన్‌రావు, వర్కింగ్ ప్రసిడెంట్‌గా పి. ప్రకాష్,ఉపాధ్యక్షులుగా లెనిన్ కృష్ణ ప్రసాద్, బి.వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి అశోక్, అడినల్ సెక్రటరీగా ఎం. శ్రీనివాస్, కోశాధికారిగా కె. శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు డబ్లూ.ఆర్. అపర్ణ, అర్గనైజింగ్ కార్యదర్శిగగా ప్రభు కిరణ్, సిద్దిరాములు, ప్రయకుమారీలు ఏకగీవ్రంగా ఎంపికయ్యారు.