హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ బిల్లులు పెరుగనున్నాయి. తెలంగాణ వాసులు ఇందుకు సంసిద్ధులు కావలసి ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ‘ఫ్యూయెల్ కాస్ అడ్జస్ట్‌మెంట్’ (ఎఫ్‌సిఏ) కింద డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు మరింత దండుకోడానికి వడ్డింపులు వేయనున్నాయి. 30 పైసల మేరకు ఎఫ్‌సిఏ వసూలు చేయడానికి డిస్కామ్‌లు ఓ ముసాయిదాను ఇటీవల జారీచేశాయి. ఇంధనం, బొగ్గు ధరల హెచ్చుతగ్గుల ఆధారంగా ఈ ఎఫ్‌సిఏ లెక్కించబడుతుంది. డిస్కాంలు విద్యుత్ వినియోగదారులపై రూ. 22000 కోట్ల భారాన్ని పెంచనున్నాయి. కాగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్(టిఎస్‌ఈఆర్‌సి) ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలుపలేదు. ఎఫ్‌సిఏ అకౌంట్‌ను వేరేగా మెయిన్‌టైన్ చేయమని కోరింది. అంతేకాక టిఎస్‌ఈఆర్‌సి నెలవారీగా ఆ ఖాతా వివరాలను సమర్పించాల్సిందిగా డిస్కామ్‌లను ఆదేశించింది. ప్రతిపాదనను కమిషన్ అయితే ఆమోదించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా తన సమ్మతిని తెలుపలేదు.
ఇదివరలో విద్యుత్ టారీఫ్‌లను పెంచబోమని డిస్కామ్‌లు 2023లోనే స్పష్టం చేశాయి. 2023లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న దృష్టా ఇంత వరకు టారీఫ్ మార్చలేదని తెలుస్తోంది. ఒకవేళ టారిఫ్ రేట్లు పెరగకపోయినప్పటికీ వినియోగదారులు యూనిట్‌కు 30 పైసల చొప్పున ఎఫ్‌సిఏగా చెల్లించకతప్పదని తెలిసింది.