Friday, November 22, 2024

విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు

- Advertisement -
- Advertisement -

విద్యుత్ సంస్థల్లో ఖాళీ గా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్‌లో విద్యుత్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉండడంతో ఆ వివరాలను పంపాలని విద్యుత్ సంస్థలను రాష్ట్ర ప్రభు త్వం కోరినట్లు సమాచారం. నాలుగు విద్యుత్ సంస్థల్లో మూడు వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోం ది. ఈ లెక్కలు తేలిన వెంటనే నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక్కో కేడర్ వారీగా వివరాలను సంస్థ ల యాజమాన్యాలు సేకరిస్తున్నాయి. ఇటీవల విద్యుత్ పంపిణీ సంస్థలు, ట్రాన్స్‌కోలలో పెద్ద ఎత్తున పదోన్నతు లు ఇచ్చారు. జెన్‌కోలో మరి కొందరికి పదోన్నతులు క ల్పించనున్నారు. ఈ పదోన్నతులతో కిందిస్థాయిలో 3వేల కు పైగా ఖాళీలు ఏర్పడుతాయని అధికారులు చెబుతున్నారు. వీటన్నింటినీ నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. డిస్కమ్‌లలో కిందిస్థాయిలో అసిస్టెంట్ లైన్‌మెన్, జూనియర్ లైన్‌మెన్, సబ్ ఇంజనీర్, సహాయ ఇంజనీర్‌తోపాటు ఇతర విభాగాల్లో కూడా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ట్రాన్స్‌కో, జెన్‌కోలలో సహాయ ఇంజనీర్ పోస్టులకు కూడా భర్తీ చేయాల్సి ఉంది.

మరో రెండు నెలల్లో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. దీనికి అవసరమైన సహాయ డివిజనల్ ఇంజనీర్, డివిజనల్, పర్యవేక్షక ఇంజనీర్ పోస్టులను సైతం పదోన్నతులపై భర్తీ చేయనున్నారు. వీటితో కిందిస్థాయిలో సహాయ ఇంజనీర్ పోస్టులు ఖాళీ కానున్నాయి. ఏడు సంవత్సరాల క్రితం భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి అవసరమైన పోస్టులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాబోతున్నందున పైస్థాయి పోస్టుల భర్తీకి పదోన్నతులు ఇప్పుడే ఇవ్వాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉత్పత్తి ప్రారంభమయ్యాకే ఇస్తామని జెన్‌కో యాజమాన్యం చెబుతోంది. దీంతో ఇంకా పదోన్నతులు ఇవ్వలేదని సమాచారం. పెగడపల్లిలో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వహణను జెన్‌కోకు అప్పగిస్తారని దానికి అవసరమైన పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. కానీ ఈ నిర్వహణ పనులను టెండరులో ఓ ప్రైవేటు సంస్థ దక్కించుకుంది. దీంతో ఈ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా పదోన్నతుల ద్వారా నింపేసి భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాల్లో ఉపయోగించుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

దీనివల్ల పోస్టులు, ఆర్థిక భారం పెరుగుతుందని యాజమాన్యం ఆపివేసినట్లు తెలిసింది. ఖర్చులు తగ్గించేందుకు జెన్‌కో కొత్త ప్రాజెక్టులు నిర్మించాలి : ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి కార్పొరేషన్ (టీఎస్-జెన్‌కో) ఆధ్వర్యంలో కొత్త విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్‌పీజేఏసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. జేఏసీ ప్రతినిధి బృందం టీఎస్ -ట్రాన్స్‌కో, టీఎస్-జెన్‌కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌ఏఎం రిజ్వీతో ఇటీవల సమావేశమై రాష్ట్రంలోని అన్ని పవర్ ప్రాజెక్టులను టీఎస్-జెన్‌కో ఆధ్వర్యంలోనే నిర్మించాలని వినతిపత్రం సమర్పించింది. జెన్‌కోకు చెందిన 62.5 మెగావాట్ల సామర్థ్యం గల రామగుండం- థర్మల్ పవర్ స్టేషన్‌ను మూసివేసి, 800 మెగావాట్ల యూనిట్‌ను స్థాపించడానికి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సిసిఎల్)కి ప్రాజెక్టుకు చెందిన 560 ఎకరాలను అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోందని వారు సిఎండికి తెలిపారు. అక్కడ 2014కు ముందు తెలంగాణలో అనేక కొత్త థర్మల్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని భావించినా ఏపీ-జెన్‌కో ఒక్కటి కూడా అమలు చేయలేదని అంటున్నారు

. వీటిలో 600 మెగావాట్లు సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్, 600 మెగావాట్లు లేదా 660 మెగావాట్లు రామగుండం టిపిఎస్, 800 మెగావాట్లు, కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్- 3, 700 మెగావాట్లు, కరీంనగర్ కంబైన్డ్ సైకిల్ గ్యాస్ పవర్ స్టేషన్ 1,000 మెగావాట్లు, శంకర్‌పల్లి గ్యాస్ పవర్ ప్రాజెక్ట్, గోదావరి నదిపై తుపాకులగూడ వద్ద 240 మెగావాట్ల సమ్మక్క సాగర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News