పొదుపు పాటించక పోతే జేబుకు చిల్లే
హైదరాబాద్: విద్యుత్‌ను అత్యంత పొదుపుగా వాడుకోక పోతే జేబుకు చిల్లు తప్పదు. వంద యూనిట్లు అటూ ఇటూగా వినియోగంచే గృహ వినియోగ దారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిందే. పెరగబోతున్న చార్జీలు మద్య తరగతి వారిపై ఎక్కువ ప్రభావం చూపనున్నాయి. చూపుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి 54 లక్షల 91 వేల 171 విద్యుత్ కనెక్షన్లు వుంటే ఒక్క గ్రేటర్‌లోనే 54 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని 9 సర్కిళ్ళలో సుమారు 52 లక్షల విద్యుత్ కనక్షన్లు ఉండగా వాటిలో 42 లక్షల గృహవిద్యుత్ వినియోగదారులు, ఉండగా మరో 10 లక్షలు నాన్‌డోమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.ఉన్నాయి. ప్రస్తుత చార్జీల ప్రకారం 201 యూనిట్లు విద్యుత్ వినియోగం ఉంటే బిల్లు 200 యూనిట్లు దాటడంతో ఎల్‌టి 1( బి2) విభాగంలోకి వస్తుంది. మొదటి 200 యూనిట్లకు రూ. 5 చొప్పన 1000 ఉండగా మిగిలిన యూనిట్ రూ.7.20 కలిపి మొత్తం 201 యూనిట్లకు 1007.20 బిల్లు వస్తుండగా ఇతర బిల్లు, చార్జీలతో కలిపి రూ.1100 వరకు బిల్లు వస్తుంది.
అయితే ప్రతిపాదిత చార్జీల ప్రకారం మొదటి 200 యూనిట్లకు రూ.5.50 చొప్పన రూ.1100 మిగిలిన యూనిట్‌కు రూ.7.70 కలిపి మొత్తం 201 యూనిట్లకు కలిపి రూ.1107.70పైసలు కాగా ఇతర చార్జీలతో కలిపి రూ.1200 వస్తుంది. అంటే 201 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించేవారు రూ.100 అదనంగా పెంచాలని ప్రతిపాదనలు పంపాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో8 లక్షల విద్యుత్ కనెక్షన్లు సబ్సిడి కింద ఉండగా మరో 20 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు 200 యూనిట్లు వరకు వినియోగిస్తున్నారని వీరి మీద చార్జీల ప్రభావం అంతగా చూపదని 400 యూనిట్లకు పైగా వినియోగించేవారుపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై ఈఆర్సీ విచారణ జరిపిన అనంతరమే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పెరగనున్న విద్యుత్ చార్జీల ప్రకారం ంద యూనిట్లు లోపు విద్యుత్ వినియోగం ఉన్న వారిని మినహాయిస్తే మిగిలిన వారికి ఎవరికి ఎంత అదనపు భారం కానుందో అని వినియోగ దారులు హడెలెత్తుతన్నారు. విద్యుత్ సరఫరా విషయంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నా వినియోగ దారులు పెరిగిన విద్యుత్ చార్జీలు తమకు అదనపు నష్టాన్ని కలిగించనున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్‌లో విద్యుత్ కనెక్షన్ల వివరాలు
మొత్తం విద్యుత్ కనెక్షన్లు: 52 లక్షలు
గృహవిద్యుత్ వినియోగదారులు: 42 లక్షలు
వాణిజ్య కనెక్షన్లు : 8 లక్షలు
పరిశ్రమలు ఇతర కనెక్షన్లు: 2 లక్షల