బకాయిల వసూళ్లకు అధికారుల ప్రత్యేక చర్యలు
హైదరాబాద్ సౌత్, రాజేంద్రనగర్ నగర్ సర్కిల్లోనే అధికం
మన తెలంగాణ/సిటీబ్యూరో: ఆర్థిక సమస్యల్లో ఉన్న విద్యుత్‌శాఖ అధికారులు పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ప్రత్యేక దృషి సారించారు. ముఖ్యంగా కరోనా సమయంలో గ్రేటర్ పరిధిలో పేరుకు పోయిన కరెంట్ బకాయిలు సుమారు రూ.223 కోట్లను వసూలు చేసేందు కు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇం దులో భాగంగా బకాయిల వసూళ్ళ కోసం ఇప్పటి వరకు లైన్‌మెన్, లైన్ ఇన్‌స్పెక్టర్లతో ఏఈలు వసూలు చేయించేవా రు. ప్రస్తుతం పెండింగ్ విద్యుత్ బకాయిలను వసూలు చేసేందుకు ఏఈ నుంచి ఎస్‌ఈ వరకు బాధ్యతలను అప్పగిం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్దం చే శారు. ఎఈ నుంచి ఎస్‌ఈ వరకు అందరికి టార్గెట్ విధిస్తున్నారు. దీంతో అధికారులు అన్ని రకాల పనులు పక్కన పెట్టి వసూళ్ళపై దృష్టి సారిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో బకాయి లు సమారు. 223 కోట్లు ఉంటే వాటిలో రూ.95 కోట్లు పాతబస్తీ పరిధిలోనే (హైదరాబాద్ సౌత్ సర్కిల్) ఉం డటం గమనార్హం. పాతబస్తీలో సాధారణ రోజుల్లో బి ల్లులు కష్టంగా వస్తాయని ఇక బకాయిలను ఏవిధం గా వసూలు చేయాలో అధికారులు ఆందోళన చెందుతున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్‌లో మరో రూ.54 కో ట్లు బకాయిలు ఉన్నాయి. మొత్తం బకాయిల్లో అగ్రభాగంలో ఈ రెండు సర్కిల్స్ ఉన్నందున ఆ ప్రాంతంలో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి వసూళ్ళపై దృష్టి పెడితే బాగుంటుందని విద్యుత్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. వి ద్యుత్ బిల్లుల వసూళ్ళ కోసం వినియోగదారులపై మొత్తం ఒకే సారి కాకుండా వాటిని విడతల వారీగా చెల్లించేందుకు అవకాశం ఇవ్వాలని కొంత మంది వినియోగదారులు కో రుతున్నారు.
ప్రధానంగా కొవిడ్ సమయంలో వ్యాపారాల్లో తీవ్ర నష్టం రావడంతో బిల్లులను చెల్లించ ఏలక పోయామని విద్యుత్ బకాయిలు చె ల్లించేందుకు వాయిదా పద్ధతిలో అవకాశం ఇవ్వాలని వారు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. బకాయిల వసూళ్ళపై రెగ్యులర్ ఉద్యోగులతో పాటు మరి కొంత మందికి అదనపు బాధ్యతలను అప్పగించడంతో దశలవారీగా మూ డు నాలుగు నెలల్లో బకాయిలు వసూలు చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. గ్రేటర్ పరిధిలోని తోమ్మిది సర్కిళ్ళలో కోవిడ్ సమయంలో నిలిచిన విద్యుత్ బకాయిలే కా కుండా ప్రతి నెల రూ.20 నుంచి 30 కోట్లు బిల్లులు వసూలు కావడం లేదని అధికారులు వాపోతున్నారు. గ్రేటర్ పరిధిలో 50 లక్షలకు పైగా విద్యుత్ వినియోగదారుల ద్వారా ప్రతి నెలా సుమారు రూ,900 కోట్లు వరకు విద్యుత్ బిల్లులు వసూళ్ళ అవుతా యి.
డిమాండ్ సుమారు రూ.950 కోట్ల మేరకు రావాల్సి ఉంటుంది. కోవిడ్ సమయంలో ఈ బిల్లుల పెండింగ్ మరింత పెరిగిపోయింది. కొద్దికాలం క్రితమే కొవిడ్ ప్రమాదం నుంచి కోలుకుంటూ వ్యాపారం పెరుగుతుండటంతో విద్యుత్ అధికారులు సైతం క్రమంగా పెండింగ్ బిల్లులను తగ్గించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సంస్థ పరిస్థితి అంతగా బాగోక పోవడంతో యాజమాన్యం పెండింగ్ విద్యుత్ వ స్ళూపై ప్రత్యేక దృష్టి సారించింది. అయితే అ క్కడ పని చేస్తున్నవారిపైనే వసూళ్ళ బాధ్యత కాకుండా మరికొంత మంది బకాయిల వస్ళూలకు కేటాయించడం ద్వారా ప్రయోనం ఉంటుందని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ బిల్లుల పూర్తిగా వసూ లు చేయలేక పోతే ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రావాల్సిన విద్యుత్ బకాయిల వివరాలు
హైదరాబాద్ సౌత్ రూ : 95 కోట్లు
రాజేంద్రనగర్ రూ : 54 కోట్లు
హైదరాబాద్ సెంట్రల్ రూ : 30 కోట్లు
సైబర్ సిటీ రూ : 20 కోట్లు
సరూర్‌నగర్ రూ : 13 కోట్లు
మేడ్చెల్ రూ : 5 కోట్లు
బంజారహిల్స్ రూ : 3 కోట్లు
సికింద్రాబాద్ సర్కిల్ రూ : 2 కోట్లు
హబ్సీగూడ రూ : 1 కోటీ