మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ పంపీణీ సంస్థ ( టిఎస్‌ఎస్‌పిడిసీఎల్) ప్రతి సర్కిల్లో ఏర్పాటు చేసిన సమీకృత వినియోగ దారుల సేవా కేంద్రాలు (ఐసీఎస్ ఎస్) వినియోగదారులకు మూసివేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తే అవుననే అనిపిస్తోంది. ఇప్ప టికే కొన్నింటిని ఫెసిలిటేట్ కేంద్రాలుగా మార్చారు. వినియోగదారులు ఏ సేవ కోసమైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ ప్రక్రియపై అవగాహన లేనివారు ఐసీఎస్సీకి వస్తే సిబ్బందే అన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారు. అంతేకాక సంబంధిత డాక్యుమెంట్లు తీసుకుని రశీదు కూడా అంచేస్తారు. ఇటువంటి కేంద్రాలు నగరంలో 30కి పైగా ఉన్నాయి. అయితే కొన్ని నామమాత్రంగా మారడంతో వీటిని ఎత్తిసే దిశగా సంస్థ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
వినియోగదారులు టైటిల్ బదిలీ కోసం ఐసిఎస్‌సికి వెళితే ఆన్‌లైన్‌లో చేసుకోవాలని సిబ్బంది చెబుతున్నారు. మీరే చేయాలని కోరితే స్కానర్ లేదని ఇంటర్‌నెట్ లేదా ఈసేవా, మొబైల్ ద్వారా చేసుకోవాలని పంపిస్తున్నారు. దీంతో వారు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవడంతో ఆన్‌లైన్‌లో సమర్పించిన డాక్యుమెంట్లను మాత్రమే కార్యాలయంలో సమర్పించాలని చెప్పడంతో వారు మరో సారి కార్యాలయానికి వెళ్ళాల్సి వస్తోంది. ఇటువంటి సమస్యలను వినియోగదారులకు ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కావడం లేదు . ఒకే వేళ వచ్చినా రేపు రా ..మాపు రా అంటూ తిప్పంచుకోవడంతో వినియోగదారులు తమ వ్యక్తిగత పనుల దృష్ట్యా వాటిని మధ్యవర్తులకు అప్పగించి ఆర్దికంగా నష్టపోతున్నారు.
విద్యుత్ సంబంధిత పనుల కోసం కోసం వినియోగదారులు ఈ కేంద్రాలను ఆశ్రయిస్తుంటారు. ఇందుకు సంబంధించి డిపాజిట్‌లను కూడా చెల్లిస్తుంటారు వాటిలో కొత్త విద్యుత్ కనెక్షన్ దరఖాస్తులే ఉంటాయి. సాధారణంగా కనెక్షన్ ఇస్తే అదనంగా కట్టిన డబ్బును బిల్లులో సర్దుబాటు చేస్తారు. సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైతే సేవా రుసుమును మినహాయించుకుని మిగతా సొమ్ము తిరిగి చెల్లించాలి. కానీ డిస్కంకు నగదు ఒకసారి చెల్లిస్తే వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. కొంత మంది వినియోగదారులు కొత్త కనెక్షన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఏదైనా సాంకేతిక కారణంలో సదరు దరఖాస్తు తిరస్కరిసే మళ్ళీ దరఖాస్తు చేసుకోమని అక్కడ పని చేసే సిబ్బంది చెబుతున్నారు. మరోసారి విద్యుత్ కనెక్షన్ కోసం సంబంధి మొత్తాన్ని డిడి రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. రెండో సారి కూడా అదే సమస్య ఏర్పడితే సదరు మొత్తం వెనక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.