Monday, December 23, 2024

విద్యుత్ వినియోగం అనేది ప్రగతి సూచికలో ముఖ్యమైంది: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Electricity consumption is important indicator of progress

హైదరాబాద్: దేశాల విద్యుత్ వినియోగాన్ని ప్రగతి సూచికలో ముఖ్యమైనదిగా ఆధునిక ప్రపంచం పరిగణిస్తుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన సభలో కెసిఆర్ మాట్లాడారు. రాష్ట్రాలు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నాయనేది ప్రగతి సూచికలో ముఖ్యమైందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. గతంలో అనేక ప్రాంతాల్లో విద్యుదాఘాతాలతో ప్రజలు చనిపోయారని, బిల్లులు కట్టలేదని విద్యుత్ అధికారులు దాడులు చేయబోతే కొందరు విషం తాగి చనిపోయారన్నారు. విద్యుత్ రంగం సహా అనేక సమస్యలపై పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. పునర్విభజన హామీల అమలులో తెలంగాణకు అన్యాయం చేశారని, కేంద్ర తొలి కేబినెట్ భేటీలోనే తెలంగాణ గొంతు నులిమే ప్రయత్నం చేసిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News