Thursday, January 23, 2025

పవర్ ‘ఫుల్’ డిమాండ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరెంట్ వినియోగం రోజురోజుకు భారీగా పెరిగిపోతోంది. వేసవి కావడంతో ఉష్ణోగ్రతల తీవ్రతకు ఫ్యాన్లు, ఎసిల వాడకం పెరిగిపోయింది. రా ష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇంతలా విద్యుత్ వినియోగం పెరగడం ఇది రెండోసారి. గురువారం ఉదయం 11.01 నిమిషాలకు 15,497 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదయ్యింది. ఇదే రాష్ట్ర చరిత్రలో అత్యధిక వినియోగంగా విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. మార్చి నెల ప్రారంభం నుంచే 15 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదవుతోంది. అయితే విద్యుత్ వినియోగలో దక్షిణాదిని తీసుకుంటే తెలంగాణ రెండోస్థానంలో ఉంది. రాష్ట్రంలో సా గు విస్తీర్ణం పెరగడం, పారిశ్రామిక అవసరాలు పెరగడం, వేసవికాలం కావడంతో ఇళ్లల్లో కూడా కరెంట్ వినియోగం భారీగా పెరుగుతోంది. మొత్తం వినియోగంలో వ్యవసాయ రంగానికి 37 శాతం వాడుతుండగా మిగిలిన కరెంట్ పారిశ్రామిక రంగంతో పాటు మిగతా రంగాలకు విద్యుత్‌ను వినియోగిస్తున్నారు.

తమిళనాడు మొదటి స్థానం

మొత్తం విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో తెలంగాణ ఉంది. రాష్ట్రంలో మార్చి 13వ తేదీన 14,138 మెగావాట్లు నమోదు కాగా మార్చి 14వ తేదీన 15,062 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదయ్యింది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధిక విద్యుత్ డిమాండ్ 15,497 మోగావాట్లు రికార్డ్ స్థాయిలో నమోదు కావడం ఈ నెలలో ఇది రెండోవసారి అని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

మార్చిలో 15,062 మెగావాట్ల పీక్ విద్యుత్ వినియోగం

గత సంవత్సరం మార్చి నెలలో 14,160 మెగావాట్ల అధిక విద్యుత్ వినియోగం నమోదు కాగా గత సంవత్సరం డిసెంబర్ నెలఖారులోనే ఈ రికార్డును అధిగమించింది. ఈ సంవత్సరం మార్చిలో 15,062 మెగావాట్ల పీక్ విద్యుత్ వినియోగాన్ని అధిగమించి గురువారం ఏకంగా 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్‌కు విద్యుత్ చేరుకుంది. ఈ సంవత్సరం వేసవిలో 16 వేల మెగావాట్లు డిమాండ్ వచ్చే అవకాశం ఉన్నట్లు విద్యుత్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఎంత డిమాండ్ వచ్చినా ఇబ్బందులు లేవు: సిఎండి ప్రభాకర్ రావు

విద్యుత్ సరఫరాకు పూర్తి ఏర్పాట్లు చేశామని విద్యుత్ వినియోగం ఎంత డిమాండ్ వచ్చినా సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ట్రాన్స్ కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. మార్చి నెలలో 15 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అవుతుందని ముందే ఉహించామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదే శాల మేరకు విద్యుత్ సపఫరాకు పూర్తి ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర అన్నదాతలకు, అన్ని రకాల వినియో గదారులకు ఎలాంటి అంతరాయం తలెత్తకుండా నిరంతరం నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తామని సిఎండి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ డిమాండ్‌లో 37 శాతం వ్యవసాయ రంగానికే వినియోగించబడుతోందని ఆయన పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి అధిక విద్యుత్ వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News