Sunday, December 22, 2024

ఎంఎల్ఎ శ్రీనివాస్ రెడ్డికి వింత అనుభవం

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్ ః మహబూబ్ నగర్ ఎంఎల్ఎ శ్రీనివాస్ రెడ్డికి మొదటి రోజే వింత అనుభవం ఎదురైంది. శ్రీనివాస్‌రెడ్డి గెలిచిన తర్వాత హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం, తర్వాత రోజుల్లో కూడా సిఎం వెంటనే ఉన్నారు. శనివారం ఎంఎల్ఎగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మొదటి సారిగా మహబూబ్ నగర్‌కు వచ్చారు. ముందుగా ఎంఎల్ఎ క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సం సందర్భంగా ఆయన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడేందుకు సిద్దంగా ఉన్న సందర్భంలో కరెంట్ పోయింది. దాదాపు అర గంట వరకు కూడా కరెంట్ రాక పోవడంతో ఎమ్మెల్యే ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు.

దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఇదంతా కావాలనే విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ కట్ చేశారని కొందరు చర్చించుకోగా, కాకతాళయంగానే పోయందని మరి కొందరు చర్చించుకున్నారు. స్వయంగా ఎంఎల్ఎ విద్యుత్ డిఇ, ఇఇలకు పోన్ చేయాల్సి వచ్చింది. అయితే ప్రొటోకాల ప్రకారం ఎమ్మెల్యే మొదటి సారి క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంలో విద్యుత్ అధికారులు ఎంఎల్ఎ దగ్గరికి రావాల్సి ఉంటుంది. క్యాంప్ కార్యాలయం వద్ద విద్యుత్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సి ఉంటుంది. కాని ఇక్కడ విద్యుత్ అధికారులు ఎంఎల్ఎ శ్రీనివాస్ రెడ్డి మొదటి సారి వస్తే కనీసం విద్యుత్ అధికారులు జాడ లేక పోగా కరెంట్ కట్ చేయడంపై ప్రజల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులకు ఇంకా పాత వాసనలు పోలేదని పలువురు విమర్శలు చేశారు.
ఎమ్మెల్యేను కలిసిన కలెక్టర్ ః
ఎంఎల్ఎశ్రీనివాస్ రెడ్డిని క్యాంప్ కార్యాలయం వద్ద జిల్లా కలెక్టర్ రవి నాయక్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎల్ఎకు బొకె అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. డిఎస్‌పి మహేష్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News