Sunday, November 24, 2024

రికార్డు వినియోగం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో పారిశ్రామిక, ఐటి, ఫార్మా రంగాలతో పాటుగా వ్యవసాయ రంగాలకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తుండటంతో అనూహ్యంగా కరెంటు వినియోగ డిమాండ్ పెరిగింది. లో సమస్యలు, కరెంటు కోతల్లేకుండా నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తుండడంతో మునుపెన్నడూ లేనంతగా 14,017 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ను చేరుకున్నట్లుగా తె లంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు వివరించారు. పారిశ్రామిక కాకుండా గృహ వినియోగం, వ్యవసాయరంగాలకు రానున్న వేసవిలో కూడా విద్యుత్తు వినియోగ డిమాండ్ ఇంత కంటే ఎక్కువగానే పెరుగుతుందని, రానున్న వేసవిలో వి ద్యుత్తు వినియోగ డిమాండ్ 16వేల మెగావాట్లకు చేరుకునే అవకాశాలున్నాయని, అందుకు తగినట్లు గా ఇప్పటినుంచే ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావు వివరించారు. రోజురోజుకు విద్యుత్ వినియోగ డి మాండ్ భారీగా పెరుగుతోందని నిన్న శుక్రవారం ఉదయం 14,017 మోగా వాట్ల డిమాండ్ నమోదు అయిందని ప్రభాకర్ రావు తెలిపారు.

రానున్న యా సంగిలో మరింతగా విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, ఇందుకు అందరూ కష్టపడి పని చే యాలని సిఎం కెసిఆర్ తమను ఆదేశించారన్నారు. ఈ నేపథ్యంలో 15500 మెగావాట్ల విద్యుత్ డి మాండ్ అవసరం వచ్చినా గానీ సరఫరా చేసేలా ప ని చేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఇంజనీర్లు, అధికారులు కష్టపడి పనిచేసి నిరంతరం విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సిఎండి ప్రభాకర్ రావు తెలిపారు. సిఎం చె ప్పినట్లు .. రానున్న రోజుల్లో 15500 వేల మెగావా ట్ల డిమాండ్ వచ్చినా గానీ నిరంతర సరఫరా చేస్తామన్నారు. తమ విద్యుత్ శాఖ ఇంజనీర్లు, అధికారులు, ఉద్యోగులు కష్టపడి పని చేస్తూ నిరంతరం విద్యుత్ సరఫరా చేయడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ అందరినీ అభినందించారని ట్రాన్స్‌కో, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు ఈ మేరకు ఆ ప్రటకనలో తెలిపారు. ఇటు భూగర్భ జలాలు పెరగడం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందన్నారు.

అయినప్పటికీ కూడా వ్యవసాయ రంగానికి ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని సిఎండి ప్రభాకర్ రావు తెలిపారు. విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని.. గత సంవత్సరంతో పోల్చితే 3082 మెగావాట్ల విద్యుత్ వినియోగం అధికంగా నమోదైందన్నారు. గత మార్చినెలలో 14160 మోగావాట్ల వినియోగంతో రాష్ట్ర చరిత్రలోనే అది అత్యధిక వినియోగం అనుకుంటే.. ఈ సారి డిసెంబర్ నెలలో ఈ స్థాయిలో (14,017 మోగా వాట్లు ) విద్యుత్ వినియోగం నమోదు కావడం గమనార్హం అన్నారు. డిసెంబర్ నెల వారీగా చూస్తే.. గత సంవత్సరం డిసెంబర్‌లో 10935 మెగావాట్ల డిమాండే అత్యధికం అనుంటే అది ఈ సంవత్సరం 14017 మెగా వాట్లుగా నమోదైందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News