Wednesday, July 3, 2024

తెలంగాణ ప్రజలకు విద్యుత్ శాఖ విజ్ఞప్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు విద్యుత్ శాఖ కీలక ప్రకటన చేసింది. విద్యుత్ వినియోగదారులు ఇకపై ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా కరెంట్ బిల్లు కట్ట వద్దని విజ్ఞప్తి చేసింది.

భారత రిజర్వు బ్యాంకు ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లయిన ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే, బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులు నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈక్రమంలో నేటి నుంచి TGSPDCL వెబ్సైట్/ మొబైల్ యాప్ ద్వారానే నెలవారీ కరెంట్ బిల్లులు చెల్లించాలని వినియోగదారులను కోరింది.

రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద.. 200  యూనిట్ల వరకు విద్యుత్ వినియోగిస్తున్నవారికి కరెంట్ బిల్ జారీ చేసినా సరే.. వారు బిల్ కట్టాల్సిన పనిలేదు. ఎవరైతే 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగిస్తున్నారో వాళ్లు మాత్రమే కరెంట్ బిల్లు చెల్లించాలంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News