సిటిబ్యూరోః బకాయిలు విడుదల చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసిన విద్యత్ శాఖ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌ను ఎసిబి అధికారులు శుక్రవారం లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి అధికారుల కథనం ప్రకారం…హైదరాబాద్, హబ్సిగూడలోని టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌లో జూనియర్ అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న సామ విజయసింహారెడ్డి రూ.35,000లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అదేశాఖలో ఆర్టిజన్‌గా పనిచేసిన భరత్ తనకు రావాల్సిన బకాయిల కోసం జూనియర్ అకౌంటెంట్‌ను సంప్రదించాడు. బకాయిల బిల్లులు చేయాలంటే డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బాధితుడు జెఏఓకు రూ.35వేలు లంచం ఇస్తుండగా ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. జెఏఓ నుంచి రూ.35వేలు స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నాంపల్లిలోని ఎసిబి కోర్టులో హాజరుపర్చగా కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది.
ఎసిబికి చిక్కిన విద్యుత్ శాఖ జెఎఓ
- Advertisement -
- Advertisement -
- Advertisement -