అత్యధికంగా కాలేశ్వరం ప్రాజెక్టు రూ.14,172 కోట్లు
అత్యల్పం జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ రూ. 5 కోట్లు
మన తెలంగాణ / హైదరాబాద్: గత కొద్ది రోజులుగా విద్యుత్‌కు సంస్థకు రావాల్సిన ఆదాయం, ఉన్నబకాయిలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసింది. సంస్థకు పేరుకు పోయిన బకాయిలులపై ఆయన అధికారులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ప్రారంభ సమావేశాల్లో అధికారులు సంస్థ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వివరాలను తెలియచేడంలో అధికారుల సమన్వయ లోపం కారణంగా సంబంధిత వివరాలను తెలియ చేయాలేక పోయారు. అయితే గురువారం 2014 నుంచి 2023 వరకు సంస్థకు ఆదాయ,వ్యయాలను అధికారులు ప్రభుత్వానికి అందచేశారు. తెలంగాణ విద్యుత్‌లో 40 శాతం పలు నీటి పారుదల ప్రాజెక్టులకు సరఫరా చేయడం జరుగుతుంది. రాష్ట్ర ఆవిర్భావ సమయం నాటికి రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ఎత్త పోతల పథకాలుకు సంబంధించి విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కంలకు) చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు రూ.1268 కోట్లు ఉండగా అక్టోబర్ 31 నాటికి అవి రూ. 28,861 కోట్లకు చేరాయి. వాటిలో గత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం లిప్టు విద్యత్ బకాయిలు రూ.14,172 ఉండటం గమనార్హం. తెలంగాణ ఆవిర్భాం నాటికి పలు శాఖలు విద్యుత్‌శాఖకు నాడు ,నేడు ఉన్న బకాయిలను విద్యుత్‌శాఖ విడుదల చేసింది.
ప్రాజెక్టు పేరు సంవత్సరం( 2014) సంవత్సరం(2023)
కాళేశ్వరం ప్రాజెక్టు బకాయిలు రూ.103 కోట్లు రూ. 14172 కోట్లు
నీటిపారుదల ప్రాజెక్టుల బకాయిలు రూ.55కోట్లు రూ.92 కోట్లు
మిషన్ భగీరథ (ఎల్‌టి, హెచ్‌టి) రూ.0000 రూ.3559 కోట్లు
పంచాయితీ రాజ్ విభాగం రూ.806 కోట్లు రూ.401 కోట్లు
జలమండలి రూ.99 కోట్లు రూ. 3932 కోట్లు
మున్సీపాల్టీలు రూ.138 కోట్లు రూ. 486 కోట్లు
కార్పోరేషన్స్ రూ.10 కోట్లు రూ. 54 కోట్లు
జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ రూ. 4 కోట్లు రూ. 5 కోట్లు
హోమ్ డిపార్టు మెంట్ రూ.17 కోట్లు రూ. 28 కోట్లు
హెల్త్ ,మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ రూ. 13 కోట్లు రూ. 48 కోట్లు
రెవెన్యూ డిపార్టుమెంట్ రూ. 11 కోట్లు రూ. 21 కోట్లు
స్కూల్ ఎడ్యుకేషన్ రూ. 7 కోట్లు రూ. 48 కోట్లు
హయ్యర్ ఎడ్యుకేషన్ రూ.2 కోట్లు రూ. 40 కోట్లు
కేంద్ర ప్రభుత్వం రూ. 0 రూ. 721కోట్లు
మొత్తం రూ.1268 కోట్లు రూ. 23685 కోట్లు
కాగా పంచాయితీ రాజ్ చెల్లించాల్సిన రూ. 3993 మొత్తం ,అదే విధంగా మున్సిపాల్టీ నుంచి రావాల్సిన మొత్తం రూ.1186 కోట్లు మొత్తం ప్రభుత్వానికి అకౌంట్‌కు బదలి కావడంతో… వాటితో కలిపి మొత్తం రూ,28861కు విద్యుత్ బకాయిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.