- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీపికబురు పంపారు. విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు 37 శాతానికి పెంచారు. ఈ మేరకు విద్యుత్ శాఖ స్పెషల్ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 27 వేల మంది విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సిఎం జగన్ మోహన్ రెడ్డి సూచనలతో విద్యుత్ శాఖ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచారు. విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.21 వేల జీతం దాటింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: చిన్నారి ప్రాణం తీసిన వేరుశనగ
- Advertisement -