Wednesday, January 22, 2025

అత్యవసర పేరిట అనంత నష్టం: విద్యుత్‌ మాజీ అధికారి రఘు

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలులో కాంపిటీటివ్ బిడ్డింగ్ జరగలేదు
ఎంఒయులు చేసుకోవడం వల్ల రాష్ట్రానికి రూ.2వేల కోట్ల నష్టం
ఇఆర్‌సి అనుమతి కూడా లేదు
తప్పు జరిగిందని గుర్తించినా రద్దు చేయడానికి వీలుపడలేదు
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఎదుట విద్యుత్‌శాఖ మాజీ అధికారి రఘు

మన తెలంగాణ / హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం విషయంలో నాటి ప్ర భుత్వం అత్యవసరం పేరిట రాష్ట్రానికి అనంతమైన నష్టాన్ని కలిగించిందని తెలంగాణ జెఎసి చైర్మన్ రఘు అభిప్రాయపడ్డా రు. హైదరాబాద్ బిఆర్‌కె భవన్‌లో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కార్యాలయానికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ శాఖ అధికారి రఘు వచ్చారు. ఇద్దరి తరువాయి వద్ద కమిషన్ వివరాలను అడిగి తెలుసుకుంది. ఈసందర్భంగా రఘు మీడియాతో మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందానికి ఈఆర్‌సి అనుమతి కూడా ఇవ్వలేదన్నారు. ప్రొవిజన్‌కు మాత్రమే అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశారు. ప్రొవిజన్‌కు సవరణలు చేసి పం పాలని ఇఆర్‌సి సూచించిందని వివరించారు.

ఏడేళ్లు గ డిచినా గత ప్రభుత్వం సవరణలు చేయలేదని, అలాగే విద్యుత్ ఒప్పందం కాంపిటేటివ్ బిడ్డింగ్ రూపంలో జరగాల్సి ఉండేదని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా ఎంఓయూ చేసుకున్నారని, ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి రూ.2,600 కోట్ల నష్టం జరిగిందని అన్నారు. ఒప్పందం ప్రకారం ఛత్తీస్‌గఢ్ విద్యుత్ సరఫరా చేయలేదని, వెయ్యి మెగా వాట్ల కోసం ఒప్పందం జరిగినా సరఫరా చేయలేదని, మరో 1000 అదనపు మెగావా ట్ల విద్యుత్ సరఫరా కోసం ఒప్పందం జరిగిందన్నారు. తప్పు జరిగిందని తరువాత తెలిసిందని, రద్దు చేయడానికి వీలు పడలేదన్నారు.

ఇరు రాష్ట్రాల డిస్కంల ద్వారా ఒప్పందాలు ఎంఓయు చేసుకున్నాయని, ఛత్తీస్‌గఢ్ ఒ ప్పందం రెగ్యులేటరీ కమిషన్ ఆమోదం పొందలేదన్నా రు. కాంపిటేటివ్ బిడ్డింగ్‌లో బిహెచ్‌ఈఎల్ 2013-14లో 88శాతం రేటింగ్ ఉండే తరువాత జీరోకు పడిపోయిందని, బిహెచ్‌ఈఎల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ పై కాగ్ రిపోర్టులు ఇచ్చిందని తేల్చిచెప్పారు. ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి అంశాలపై తమ వద్ద ఉన్న సమాచారాన్ని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు ఇచ్చామని, కమిషన్ ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చామని రఘు స్ప ష్టం చేశారు. భద్రాద్రి థర్మల్ పాలట్‌లో సబ్ క్రిటికల్ టెక్నాలజీ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఛాయిస్ కాదని, ఇం డియా బుల్స్ కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీ మిషనరీ రూపొందించారన్నారు.

ఇండియా బుల్స్‌తో ఒప్పందం రద్దు కావడంతో సబ్ క్రిటికల్ మిషనరీ నెలకొల్పారని, దాంతో జరిగే నష్టాన్ని 25 ఏళ్లపాటు భరించాల్సి ఉం టుందన్నారు. గోదావరిలో వరదలు ఎక్కువైతే భద్రాద్రిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. సాంకేతిక పరమైన అంశాలను దృష్టిలోకి తీసుకోకుండా భద్రాది నిర్మాణం చేయడం సరికాదని, సాంకేతిక పరమైన అం శాలను దృష్టిలోకి తీసుకోకుండా భద్రాద్రి నిర్మాణం చేయడం సరికాదన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లొ కేషన్ వల్ల రవాణా ఛార్జీల భారం ఎక్కువ ఉంటుందని, పర్యావరణ అంశాలను లెక్క చేయకుండా భద్రాద్రి ని ర్మాణం ప్రారంభించారన్నారు. కాంపిటేటివ్ బిడ్డింగ్‌తో రేటు తక్కువ అయ్యే అవకాశం ఉండేదని, అప్పటి ప్ర భుత్వం అలా చేయలేదన్నారు. 2016లో సమస్య గు రించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు.

క్రిమినల్ చర్యలకూ వెనుకాడొద్దు: కోదండరాం
గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాం ఆరోపించారు. చట్టం ప్ర కారం అందరూ నడుచుకోవాలని, ప్రజా సంక్షేమం కోసం తన అధికారాన్ని ఉపయోగించాలన్నారు. అభివృద్ధి అంటే ఒకరిద్దరికి లాభం చేయడం కాదని, గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల ట్రాన్స్‌కో, జెన్‌కోలకు రూ.81వేల కోట్ల అప్పులయ్యాయన్నారు. భవిష్యత్‌లో గోదావరి వద్ద నీటి మట్టం పెరిగితే భద్రాది ప్లాం ట్‌ను కాపాడుకోగలమా అని ప్రశ్నించారు. గత ఏడాది వచ్చిన వరదలకు భద్రాద్రి ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ఆపేయాల్సి వచ్చిందని, గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఆ తప్పిదాలపై క్రిమినల్ చర్యలకు కూడా వెనుకాడవద్దని కోదండరాం కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News