Sunday, September 22, 2024

నూతన కేంద్ర విద్యుత్ చట్టంతో విద్యుత్ సబ్సిడీలు రద్దు అవుతాయి

- Advertisement -
- Advertisement -

Electricity subsidies

 

మన తెలంగాణ, హైదరాబాద్ : కేంద్ర విద్యుత్ సవరణ ముసాయిదా బిల్లు ఆమోదం పొందితే రాష్ట్ర ప్రభుత్వాలు అణగారిన వర్గాలకు ఇస్తున్న సబ్సిడి రద్దు అయ్యే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా యాదగిరి ఆందోళన వ్యక్తం చేశారు. బుదవారం ఆయన స్థానిక కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఇటువంటి తొందర పాటు నిర్ణయాలతో బడుగుబలహీన సామాజిక వర్గాల వినియోగదారులపై ఆర్దిక భారం పడే అవకాశం ఉందన్నారు. గత 7 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎటువంటి విద్యుత్ కోతలు , విద్యుత్‌షాక్‌లు లేవని, అంతే కాకుండా రైతులకు మీటర్ల కాలిపోతాయన్న భయం లేదన్నారు. అంతే కాకుండా రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకోలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నూతన ముసాయిదాతో వ్యవసాయ రంగానికి చార్జీలు వసూలు చేయడం జరుగుతుందన్నారు.

మన రాష్ట్రంలో సుమారు 24.4 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, వీటికి మీటర్లు బిగించేందుకు ఒకొక్క కనెక్షన్‌కు సుమారు 1500 నుంచి 2వేలు అవుతుందని దీంతో రూ.425 కోట్లు డిస్కం మీద భారం పడుతుందున్నారు. డిస్కంలు ఆయా భారాన్ని రైతులు నుంచి వసూలు చేసే అవకాశం ఉందన్నారు. అంతే కాకుండా కరెంట్ బిల్లులు 5 హెచ్‌పి మోటార్‌కు ప్రతి 8 నెలలకు రూ.43 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అంతే కాకుండా వాణ్యి పరిశ్రమలకు నుంచి వసూలు చేసే మొత్తానిన గృహ వినియోగదారులకు మళ్ళిస్తుందని దీన్నే క్రాస్ సబ్సిడీ అంటారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం డిస్కంలను ప్రైవేట్‌కు అప్పగించేందుకు సిద్దం అవుతోందని, దీంతో ఉచిత రాయితీలకు దెబ్బపడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు ధైర్యంగా వ్యసాయం చేసుకుంటున్నారని, కాని నూతన కేంద్ర విద్యుత్ బిల్లుతో రైతుల ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు పాలిట శాపంగా మారుంతుందన్నారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు బెనర్జీ ,గోవర్దన్, రఘు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News