Monday, December 23, 2024

రాష్ట్రంలో భారీగా తగ్గిన విద్యుత్ వినియోగం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో చిరు జల్లులతో వాతావరణం ఒక్క సారిగా చల్లబడడం, అటు వ్యవసాయ పంటలకు కరెంటు వాడకం లేనందున రోజు వారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ తాజాగా బాగా తగ్గి పోయింది. వారం పది రోజుల క్రితం వరకు వేసవి ఎండల తీవ్రత ఒక మాదిరిగా ఉన్నా.. చిరు జల్లలతో ఒక్క సారిగా వాతావరణంలో మార్పుల వచ్చేశాయి. ఉదయం నుండి మద్యాహ్నం వరకు సాధారణ అవసరాలేక కరెంటును వినియోగిస్తున్నారు తప్పితే .. ఏసిలు, కూలర్ల జోళికెళ్లడం లేదు. దీనికి తోడు వ్యవసాయ పరంగానూ కరెంటు వాడకం బాగా తగ్గి పోయింది. ఈ క్రమంలో నిన్న శుక్రవారం రాష్ట్ర విద్యుత్ డిమాండ్ 8365 మెగావాట్లు నమోదైంది. ఇది రెండు రోజుల క్రితం గురువారం 8362గా ఉంది. సరిగ్గా ఏదాది క్రితం ఇదే రోజున స్టేట్ విద్యుత్ డిమాండ్ 6689 మెగావాట్లుగా ఉండడం గమనార్హం.

నిజానికి ఈ వేసవిలో మూడు మాసాల క్రితం అంటే.. గత మార్చి 14వ తేదీన విద్యుత్ వినియోగం సరికొత్త రికార్టులనే సృష్టించింది. సుమారు 15,062 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. పంటలు కోత దశలో ఉండడంతో పాటు వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరగడం, పారిశ్రామిక అవసరాలు, వేసవితో గృహావసరాల కోసం ప్రజలు కరెంటును భారీగా వాడడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గరిష్ట డిమాండ్ ఈ ఏడాది ఏప్రిల్ 1న 9121 మెగావాట్లుగాను, నార్తర్న్ వపర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ 5738 మెగావాట్లు గాను విద్యుత్తు వినియోగించారు. వేసవి కాలం ముగిసే సరికి కనీసం 16 వేల మెగావాట్ల రికార్డు దాటే అవకాశం ఉంటుందని కూడా అధికారులు చెప్పారు. కాగా ప్రస్తుతం చిరుజల్లులతో వాతావరణం మారిపోవడంతో పాటు వ్యవసాయ విద్యుత్ వినియోగం కూడా భారీగా తగ్గడం గమనార్హం.

తగ్గిన వ్యవసాయ వినియోగం…
రాష్ట్రంలో సుమారు సుమారు 28 లక్షల వరకు వ్యవసాయ బోర్లుకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. దీనికి తోడు అనధికారికంగానూ వాడుతున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. అయితే అది కేవలం వ్యవసాయ పరంగానే వాడుకుంటున్నారు తప్పితే గృహావ సరాలకో, లేదా కమర్షియల్ విద్యుత్ వాడకానికి అనధికారికంగా వినియోగించక పోవడం విశేషం. నెల కిందటి వరకు యాసంగి పంటల సాగు కోసం బోర్ల వాడకం వల్ల రోజు వారీ కరెంటు వాడకం అత్యధికంగా 28.30 కోట్ల యూనిట్లు నమోదైంది. తాజాగా జూన్ 20న రాష్ట్రంలో మొత్తం అన్ని రకాల కనెక్షన్లకు కలిపి కరెంటు వినియోగం 18.28 కోట్ల యూనిట్లే నమోదు కావడం గమనార్హం.

వాస్తవానికి జూన్ 10న మొత్తం వినియోగం 13.20 కోట్ల యూనిట్లే ఉంది. ఆ తర్వాత ఎండల తీవ్రత తగ్గడంతో పాటు గృహావసరాలకు కూడా విద్యుత్ వినియోగం భారీగా తగ్గింది. రెండు రోజులుగా సాయంత్రం వేళల్లో చిరు జల్లులు కురుస్తుండడంతో వర్షాకాలం వచ్చినట్లేనని పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలో వర్షాలు కురిస్తే రోజుకు 15 కోట్ల యూనిట్లలోపే విద్యుత్ వినియోగం ఉంటుందని డిస్కంలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం డిమాండ్, వినియోగం లేనందున రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిపి వేసి వాటిని వార్షిక మరమ్మతులు చేయించాలని విద్యుత్ శాఖ భావిస్తోంది. తిరిగి వర్షాలు పడక పోతేనే ఈ జూన్ దాకా విద్యుత్ డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంటుందని డిస్కం అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 27.10 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఒక్కో వ్యవసాయ మోటారుకు రూ. 1.20 లక్షల సబ్సిడీ రైతులకు అందుతోంది. ఉదా.. పాలకుర్తి నియోజక వర్గాన్నే తీసుకుంటే పాలకుర్తి నియోజక వర్గంలో 87,980 మంది రైతులకు రూ. 880.04 కోట్ల రాయితీలు అందాయి. అదనంగా 501 రజక సోదరులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీన కోసం ఒక్క పాలకుర్తి నియోజక వర్గంలోనే ప్రభుత్వం రూ. 16.66 లక్షలు ఖర్చు చేస్తోంది. 250 నాయీ బ్రాహ్మణుల కోసం 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు రూ. 36.62 లక్షల సబ్సిడీని మంజూరు చేసింది. ఎస్‌సి, ఎస్‌టి విద్యుత్ వినియోగదారుల కోసం 101 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కింద మొత్తం 887 సేవలకు గాను రూ. 3.73 కోట్ల సబ్సిడీలు అందజేసింది. పాలకుర్తి నియోజక వర్గంలో ప్రస్తుతం ఉన్న 27 సబ్ స్టేషన్లకు అదనంగా రూ. 25 కోట్లతో 14 కొత్త సబ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఈ నియోజక వర్గంలో 5,830 ట్రాన్స్‌ఫార్మర్లే ఉండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News