Monday, December 23, 2024

విద్యుత్ ఉద్యోగులు స్వేచ్ఛగా సమస్యలను చెప్పవచ్చు: మల్లురవి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: విద్యుత్తు ఉద్యోగులు స్వేచ్ఛగా తమ సమస్యలను యాజమాన్యాలకి, ఈ ప్రభుత్వాలకు తెలియచేసే దిశగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని మాజీ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి అన్నారు. మంగళవారం మింట్ కంపౌండ్‌లో జరిగిన 1104 విద్యుత్ యూనియన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక సమస్యల పరిష్కారంలో చట్టాలకు లోబడి నిబంధనలకు అనుగుణంగా మీ పంథాలో మీరు కొనసాగాలన్నారు.. ప్రభుత్వానికి కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించి ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి విద్యుత్ రంగం పురోగతిలో భాగస్వాములు కావాలన్నారు.

ఎన్నో ఆశలతో అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో కార్మిక సంఘాలను అనిచివేచే ధోరణిలో గత ప్రభుత్వాలు వ్యవహరించినాయని అందుకు తగిన మూల్యం చెల్లించుకుని ప్రతిపక్ష పాత్రకు పరిమితమైనట్లు తెలిపారు. యూనియన్ ప్రదాన కార్యదర్శి జి. సాయిబాబా మాట్లాడుతూ… ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పై మాకు సంపూర్ణ విశ్వాసం ఉందని విద్యుత్ అమెండ్‌మెంట్ బిల్లు విషయంలో ఫిబ్రవరి జరిగే జాతీయస్థాయి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులను ఆహ్వానించే దిశగా ఆలోచన చేస్తున్నామన్నారు. విద్యుత్ రంగ పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి యూనియన్ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని, ఈ రంగాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరం వెళ్ళటానికైనా 1104 యూనియన్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, సలహాదారులు జనార్దన్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సీనియర్ నాయకులు, టిఎస్‌ఎస్‌పిడిసీఎల్, ఎన్‌పిడిసిఎల్, ట్రాన్స్‌కో,జెన్‌కో కంపెనీల అధ్యక్ష, కార్యదర్శలు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు అసోసియేషన్ నాయకులు మల్లు రవిని ఘనంగా సన్మానించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News