Thursday, January 16, 2025

విద్యుత్ కార్మికుల ధర్నా… ఖైరతాబాద్‌లో ట్రాఫిక్ జామ్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని ఖైరతాబాద్‌లో విద్యుత్ సౌధ వద్ద ధర్నా చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. వేతన సవరణ, ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై విద్యుత్ ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. విద్యుత్ సౌధా వద్దకు ఉద్యోగులు భారీగా తరలి వచ్చారు. ఈ ధర్నాలో తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి విద్యుత్ కార్మికులు భారీ ఎత్తున తరలి రావడంతో విద్యుత్ సౌధ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఖైరతాబాద్-పంజాగుట్ట రహదారిపై వాహనాలు భారీగా నిలిచాయి. రవీంద్రభారతి, లక్డీకపూల్, మాసబ్ ట్యాంక్, మహావీర్ ఆస్పత్రి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News