Thursday, January 23, 2025

విద్యుత్ అయస్కాంత ప్రభావం

- Advertisement -
- Advertisement -

 

ఆంపియర్ కుడిచేతి నిబంధన
వాహకంలో వ్యిద్యుత్ ప్రవహించే దిశలో కుడిచేయి బొటనవేలు చేపిస్తూ, ఆ వాహకాన్ని పట్టుకుంటే, ఆ వాహకం చుట్టూ మిగిలిన వేళ్లు ముడుచుకునే దిశలో అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది.
ఫ్లేమింగ్ ఎడమ చేతి నిబంధన
ఎడమ చేతి చూపుడు వేలు, మధ్యవేలు, బొటన వేలును పరస్పరం లంబంగా ఉండేటట్లు చాచినప్పుడు చూపుడు వేలు అయస్కాంత క్షేత్ర దిశను, మధ్యవేలు విద్యుత్ ప్రవాహ దిశను, బొటన వేలు బల దిశను సూచిస్తుంది.
ఫ్లేమింగ్ కుడి చేతి నిబంధన
కుడి చేతి చూపుడు వేలు, మధ్యవేలు, బొటనవేలును పరస్పరం లంబంగా ఉండేటట్లు చాచినప్పుడు చూపుడువేలు అయస్కాంత క్షేత్ర దిశను, మధ్యవేలు విద్యుత్ ప్రవాహదిశను, బొటనవేలు వాహనదిశను తెలియజేస్తుంది.
విద్యుదయస్కాంత ప్రేరణ
l వలయంలో విద్యుత్ ప్రవాహం లేకుండా మారుతున్న అయస్కాంత క్షేత్రం వల్ల వలయంలో విద్యుత్ పట్టించే ప్రక్రియను విద్యుత్ అయస్కాంత ప్రేరణ అంటారు.
l దీనిని మైఖెల్ ఫారడే కనుగొన్నాడు.
వెంజ్ నియమం
వలయంలో ప్రేరిత విద్యుత్ ప్రవాహం దీనిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన మార్పుని వ్యతిరేకించే దిశలో కనిపిస్తుంది.
స్వయం ప్రేరణ
ఒక ఏకాంత తీగచుట్టలో విద్యుత్ ప్రవాహ మార్పువలన అదే తీగలో, ప్రేరణ ఏర్పడటాన్ని స్వయం ప్రేరణ అని అంటారు.
అన్యోన్య ప్రేరణ
l ఒక చుట్టలోని విద్యుత్ ప్రవాహ మార్పు వలన, దగ్గరగా ఉన్న మరొక తీగ చుట్టలో ప్రేరిత emf ఉత్పత్తి అవడాన్ని అన్యోన్య ప్రేరణ అంటారు.
l ప్రమాణం = హెన్రీ (లేదా) ఓల్ట్ సెకన్/Amp.
సమర్థవంతమైన విద్యుత్ ప్రసారం
l ఎక్కువ పొటెన్షియల్, తక్కువ విద్యుత్‌ని రవాణా చేయడాన్ని సమర్థవంతమైన విద్యుత్ ప్రసారం అంటారు.
l దూర ప్రదేశాలకు తక్కువ కాలవ్యవధిలో వార్తలను పంపే ఆధునిక సాధనాలలో మొదటిది టెలిగ్రాఫ్
l టెలిగ్రాఫ్ విద్యుదయస్కాంత సూత్రంపై పనిచేస్తుంది.
l సెలీనియం వంటి అర్థవాహకాలపై కాంతి ప్రసరింపచేస్తే వాటి నిరోధం విలువ మారుతుంది.
విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఉష్ణ ఫలితం
l విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే ఉష్ణ ఫలితాన్ని జౌల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
l ఏదైనా వాహకం గుండా కరెంటు ప్రవహించినప్పుడు శక్తి నిత్యత్వ నియమం ఆధారంగా ఉష్ణం విడుదల అవుతుంది.
మాక్స్‌వెల్ కార్క్‌స్క్రూ నిబంధన
కార్క్ స్క్రూను విద్యుత్ ప్రవాహదిశలో ముందుకు వెళ్తుతున్నట్లు తిప్పినప్పుడు స్క్రూ తల తిరిగే దిశ, అయస్కాంత బలరేఖల దిశను సూచిస్తుంది.
జౌల్ నియమం
l జరిగిన పనికి, వెలువడిన ఉష్ణానికి అనులోమాను పాతంలో ఉంటుంది.
l ఒక పనిని ఎన్ని విధాలుగా చేసిన, వెలువడిన ఉష్ణం ఒకే విధంగా ఉంటుంది.
l విద్యుత్ సామర్థం విద్యుత్ వల్ల జరిగే పని రేటునే విద్యుత్ సామర్థం అంటారు.
l P=W/T (పని/కాలం)
ప్రమాణం : జౌల్/సెకన్ (లేదా) వాట్.
నోట్ : 1 హార్స్ పవర్ = 746 వాట్స్.
వాటేజ్
ఒక విద్యుత్ సాధనం, విద్యుత్‌ని వినియోగించుకునే రేటునే వాటేజ్ అని అంటారు.
వాటేజ్‌ని KWH (or) units అనే ప్రమాణాలతో కొలుస్తారు.
విద్యుత్ విశ్లేషణం
l ద్రావణం గుండా విద్యుత్‌ని పంపించి ఆ ద్రావణాలను విఘటనం చెందించే ప్రక్రియను విద్యుత్ విశ్లేషణం అంటారు.
l విద్యుత్ విశ్లేషణం చేయడానికి ఉపయోగించే పాత్రలను వోల్టామీటర్ అంటారు.
ఫారడే మొదటి నియమం
l విద్యుత్ విశ్లేషణలో, విద్యుత్ విశ్లేష్యాల నుండి విడుదల అయ్యే అయాన్‌ల ద్రవ్యరాశి (n), దాని గుండా ప్రవహించే కరెంటు, కాలం లబ్దానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
l m=k it, k- – అనుపాత స్థిరాంకం.
l m= z it , z- విద్యుత్ రసాయన తుల్యాంకం.
ఫారడే రెండో నియమం
l ఒకే విద్యుత్ ఆవేశాన్ని కలిగి ఉండి, వేర్వేరు విద్యుత్ విశ్లేష్యాల గుండా ప్రవహిస్తే, ప్రతీ ఎలక్ట్రోడ్‌ల వద్ద అయాన్‌ల ద్రవ్యరాశి, వాటి రసాయన తుల్యాంకాలకు అనులోమాను పాతంలో ఉంటుంది.
l M1:M2:M3 = E1:E2:E3
(or)
l M1/E1 = M2/E2=M3/E3.
నోట్ : E రసాయన తుల్యాంకం.
E= భారం /వేలన్సీ = A / V
ఫారడే విద్యుత్ విశ్లేషణ నియమాల అనువర్తనాలు
1. లోహాలను శుద్ది చేయడం.
2. ఎలక్ట్రోపేటింగ్
3. ఎలక్ట్రోటైపింగ్
l విద్యుత్ వాహకం గుండా ప్రవహిస్తున్నప్పుడు వాహకంలో విద్యుత్ క్షేత్రంతో పాటు అయస్కాంత క్షేత్రం కూడా ఏర్పడుతుందని తొలిసారిగా అయిర్‌స్టెడ్ అనే శాస్త్రవేత్త కనుగొగ్నాడు.

ట్రాన్స్‌ఫార్మర్

l విద్యుదయస్కాంత ప్రేరణ ద్వారా ఎసి ఓల్టేజ్ పరిమాణాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి ఉపయోగపడే విద్యుత్ సాధనాన్ని ట్రాన్స్ ఫార్మర్ అంటారు.
l ఇది అన్యోన్య ప్రేరణ అనే నియమం ఆధారంగా పనిచేస్తుంది.
భాగాలు
1. ప్రధాన వేష్టణం, 2. గౌణ వేష్టణం,
3. ఇనుప కోర్
రకాలు
1. స్టెప్ అప్ ట్రాన్స్‌ఫార్మర్
2. స్టెప్‌డౌన్ ట్రాన్స్‌ఫార్మర్
స్టెప్‌అప్ ట్రాన్స్‌ఫార్మర్
l ప్రధాన వేష్టణంలో చుట్ల సంఖ్య(n1)కంటే, గౌణవేష్టణంలో చుట్ల సంఖ్య (n2) ఎక్కువ ఉంటే దానిని స్టెప్ అప్ ట్రాన్స్‌ఫార్మర్ అంటారు.
స్టెప్ డౌన్ ట్రాన్స్‌ఫార్మర్
గౌణ వేష్టనంలోని చుట్ల సంఖ్య (n2) కంటే ప్రదాన వేష్టణంలోని చుట్ల సంఖ్య (n1) ఎక్కువగా ఉంటే దానిని స్టెప్‌డౌన్ ట్రాన్స్‌ఫార్మర్ అంటారు.

కెపాసిటర్
l తనలో కొంత ఆవేశాన్ని నిల్వ ఉంచుకునే పరికరాన్ని కెపాసిటర్ అంటారు.
l దీనికి ప్రమాణం : ఫారడే (సి).
నిరోధాల శ్రేణి సంధానం
l రెండు లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలను ఒక వరుస క్రమంలో అమర్చినా, అటువంటి అమరికను నిరోధాల శ్రేణి సంధానం అంటారు.
l నిరోధాల శ్రేణి సంధానం చేస్తే ఫలిత నిరోధం, వాటి విడి నిరోధాల మొత్తానికి సమానం.
l నిరోధాల శ్రేణి సంధానంలో ఒకే కరెంటు ప్రవహిస్తుంది.
l నిరోధ శ్రేణి సంధానంలో వేరువేరు పోటెన్షియల్ వాటి మధ్య విభజించబడుతుంది.
l నిరోదం శ్రేణి సంధానం చేస్తే వాటి ఫలిత నిరోధం, వాటి విడి నిరోధాల మొత్తానికి సమానం. వాటి ఏదైనా విడి నిరోధాల కంటే ఎక్కువ.
నిరోధాల సమాంతర సంధానం
l రెండు లేదా అంతకన్నా ఎక్కువ నిరోధాలు ఒకే ఉమ్మడి బిందువుకు కలుపగా ఏర్పడే అమరికను నిరోధాల సమాంతర సంధానం అంటారు.
నిరోధాల సమాంతర సంధానం చేస్తే ఫలిత ఉత్క్రమణం (1/R), వాటి విడి వ్రుత్కమణాల మొత్తానికి సమానం.
l నిరోధాల సమాంతర సంధానంలో వేర్వేరు కరెంట్లు ప్రవహిస్తాయి.
l నిరోధాల సమాంతర సంధానంలో ఒకే పొటెన్షియల్ వాటి మధ్య విభజించబడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News