Wednesday, January 22, 2025

ఫాక్స్‌కాన్ మనదే

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సిఎం కె.చంద్రశేఖర్ రావు చేస్తున్న కృషి, ఆయన విజన్ తనకు ఎంతో ప్రేరణ ఇచ్చిందని ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లి యూ అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని కొంగర క లాన్‌లో ఫాక్స్‌కాన్ ఉత్పత్తి తయారీ కేంద్రాన్ని ఏ ర్పాటు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు ఆ యన వెల్లడించారు. మార్చి 2న ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియూప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌తో భేటీ అయిన విషయం విధితమే. ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణలో ఏర్పాటు చేయడం లేదని, బెంగ ళూరులో కూడా ఏర్పాటు చేయడం లేదని వచ్చిన పుకార్లకు తెరదించుతూ చైర్మన్ యంగ్ లియూ సోమవారం సిఎం కెసిఆర్‌కు రాసిన లేఖ తో స్పష్టత వచ్చింది. హైదరాబాద్ తమ బృందం సందర్శించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. హై దరాబాద్‌లో బస చేసిన సమయం అద్భుతంగా సాగిందన్నారు.

సిఎం కెసిఆర్‌పై తన లేఖలో ప్ర శంసలు కురిపించారు యంగ్ లియూ. తన పుట్టి నరోజు సందర్భంగా కెసిఆర్ శుభాకాంక్షలు తెలి పారని, అలాగే తనకు వ్యక్తిగతంగా గ్రీటింగ్ కార్డు ఇవ్వడం పట్ల లియూ థ్యాంక్స్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి పట్ల కెసిఆర్‌కు ఉన్న విజన్ నన్ను ఎంతో ప్రేరణకు గురిచేసిందని లియూ అన్నారు. ఇండియాలో తనకు ఓ కొత్త స్నేహితుడు దొరికినట్లు లియూ తన లేఖలో చెప్పారు. భవిష్యత్తులోనూ కెసిఆర్‌తో కలిసి పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. మార్చి 2వ తేదీన చర్చించినట్లే.. కొంగర కలాన్‌లో ఫాక్సాకాన్‌ను ఏర్పాటు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని లియూ తెలిపారు. వీలైనంత త్వరగా మాన్యుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మీ బృందం సహకారాన్ని కోరనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా సిఎం కెసిఆర్‌ను తైవాన్‌కు ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

తైపీలో ఆతిధి సత్కారాలను అందుకోవాలని తన లేఖలో సిఎంను ఆయన కోరారు. కొంగరకలాన్‌లో ఏర్పాటు చేయబోయే ఫ్యాక్టరీతో లక్ష ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్‌లో రూ.3500 కోట్ల పెట్టుబడితో ఫాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్ కంపెనీని నెలకొల్పేందుకు తైవాన్ దేశం ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కంపెనీకి 250 ఎకరాలు అవసరం కాగా.. ఇప్పటికే సర్వే నం.300లో 187 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వ కేటాయించింది. ఇందుకుగాను రెవెన్యూ అధికారులు, టిఎస్‌ఐఐసి అధికారులు రెండు మూడు నెలలుగా సర్వే చేసి భూమిని సిద్ధంగా ఉంచారు. మిగతా భూమిని త్వరలోనే సేకరిస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News