Saturday, December 28, 2024

రూ.లక్ష కోట్లతో ఎలక్ట్రానిక్ రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించి, ఎలక్ట్రానిక్ పద్థతికి మార్చేందుకు రైల్వే విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం లక్ష కోట్ల రూపాయలు (ట్రిలియన్) వెచ్చించనున్నట్లు తెలిపింది. ఒడిషాలోని బాలాసోర్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 290 మందికి పైగా దుర్మరణం చెందారు. ఈ ఘోర ప్రమాదానికి సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలే కారణం అని సేఫ్టీ కమిషన్ తేల్చింది. దీనితో ఇక ముందు ఇటువంటి విపత్తులు తలెత్తకుండా చేసేందుకు ట్రిలియన్ రూపాయలతో ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటు నిర్ణయం జరిగింది.

బాలాసోర్ రైలు దుర్ఘటన సంబంధించి ఏడుగురు రైల్వే సిబ్బంది సస్పెండయ్యారు. ఈ మేరకు రైల్వే శాఖ ఓ ప్రకటన వెలువరించింది. ఇటీవల సిబిఐ అరెస్టు చేసిన ముగ్గురు అధికారులు కూడా సస్పెన్షన్ వేటుకు గురైన వారిలో ఉన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండిఉంటే ప్రమాదం జరిగి ఉండకపొయ్యేదని, దీనిని పరిగణనలోకి తీసుకుని వీరిని కిందిస్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు ఆగ్నేయ రైల్వే జనరల్ మేనేజర్ అనిల్‌కుమార్ మిశ్రా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News