Friday, December 27, 2024

హైదరాబాద్‌లో ఎలిమెంటరీ లివింగ్‌..

- Advertisement -
- Advertisement -

ఫర్నిచర్‌ పరంగా వినూత్నశైలి మాత్రమే కాదు ఆ ఫర్నిచర్‌ తమ ఇంటికి నూతన అందాలనందించాలని కోరుకుంటే ఎలిమెంటరీ లివింగ్‌ ఫర్నిచర్‌, హోమ్‌ డెకార్‌ను సందర్శించాల్సిందే!. ఎలిమెంటరీ లివింగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన బ్రూనో, ప్యాలెస్‌ విండో, లీపాన్‌, వెస్ట్‌ విలేజ్‌ కలెక్షన్స్‌ ఇప్పుడు హైదరాబాద్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

‘‘అసాధారణ శ్రేణితో కూడిన ఎలిమెంటరీ కలెక్షన్‌ ఇప్పుడు హైదరాబాద్‌ సహా భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని స్టోర్లలోనూ లభిస్తుందని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాము. మా వినియోగదారులకు మహోన్నతమైన జీవనశైలిని ఎలిమెంటరీ లివింగ్‌ ఫర్నిచర్‌ శ్రేణితో అందించడానికి సిద్ధంగా ఉన్నాము. స్ఫూర్తిదాయక కలెక్షన్స్‌ను అన్వేషించేందుకు అందరినీ స్వాగతిస్తున్నాము’’ అని ఆయుష్‌ బైద్‌, ఫౌండర్‌, ఎలిమెంటరీ అన్నారు

ఎలిమెంటరీ లివింగ్‌ కలెక్షన్‌ గురించి..

సంక్లిష్టంగా, సవివరంగా ఉంటూనే రాజరికపు వైభవం ప్రతిబింబిస్తూ, మీ అభిరుచులకు తగినట్లుగా ఉండే డిజైన్స్‌ కలిగిన కలెక్షన్‌, కళాత్మకత మరియు ఆధునిక సున్నితత్వంల సమతుల్యతతో ఇంటికి నూతన అందాలనందిస్తుంది. విభిన్నమైన లీ పాన్‌ కలెక్షన్‌లో డైనింగ్‌ టేబుల్‌, లీ పాన్‌ కుషన్‌, సీటెడ్‌ బెంచ్‌ మరియు లీ పాన్‌ కుషన్‌ సీటెడ్‌ చైర్‌ ఉంటాయి.

ఇక రూపు పరంగా ఆధునికంగా ఉన్నప్పటికీ స్ఫూర్తి పరంగా రెట్రోను ప్రతిధ్వనించే వెస్ట్‌ విలేజ్‌ కలెక్షన్‌లో రెండు డోర్ల క్యాబినేట్‌, వెస్ట్‌ విలేజ్‌ టవల్‌ హోల్డర్‌, డ్రాయర్‌తో వెస్ట్‌ విలేజ్‌ అప్‌హోలెస్టర్డ్‌ కుషన్‌ బెంచ్‌, వెస్ట్‌ విలేజ్‌ ఫోర్‌ సీటర్‌ ఓవల్‌ డైనింగ్‌ టేబుల్‌, వెస్ట్‌ విలేజ్‌ కేన్‌ చైర్‌ ఉన్నాయి. బ్రూనో కలెక్షన్‌ ఆవిష్కరణలకు పరాకాష్టగా ఉంటుంది. ఈ కలెక్షన్‌లో మెటల్‌ స్టాండ్‌తో బ్రూనో ట్రిపుల్‌ డ్రాయర్‌ చెస్ట్‌, మెటల్‌ స్టాండ్‌తో బ్రూనో బార్‌ క్యాబినెట్‌, బ్రూనో బార్‌ ట్రాలీ వంటివి ఉంటే ప్యాలెస్‌లలో కనిపించే అందమైన శిల్పాకృతులతో కూడిన పాలెస్‌ విండో కలెక్షన్‌లో విండో కాఫీ టేబుల్‌, పాలెస్‌ విండో ఒన్‌ డ్రాయర్‌ ఎండ్‌ టేబుల్‌ ఉన్నాయి.

Elementary Living reached Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News