Tuesday, December 24, 2024

ఇంటిపై ఏనుగు దాడి… మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: గురువారం తెల్లవారుజామున ఏనుగు దాడి చేయడంతో మహిళ మృతి చెందడంతో పాటు ఇల్లును ధ్వంసం చేసిన సంఘటన ఒడిశా రాష్ట్ర సుందర్‌గఢ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బర్సౌన్ అటవీ ప్రాంతంలోని డెంగూల గ్రామంలో సితా ముండా(36), బర్‌సియా ముండా(41), ఇద్దరు కూతుళ్లు, కుమారుడితో కలిసి జీవిస్తోంది. గురువారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు నుంచి ఓ ఏనుగు డెంగూల గ్రామంపై దాడి చేసింది. ఏనుగు నుంచి తన కూతుళ్లు, కుమారుడిని కాపాడిన సీతాను ఏనుగు తొక్కి చంపింది. అనంతరం ఆమె ఉంటున్న ఇంటిని ధ్వంసం చేసింది. స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏనుగుల భారీ నుంచి తమను కాపాడాలని అటవీ శాఖ అధికారులను కోరారు. సీతా చనిపోవడంతో ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరు లక్షల రూపాయల పరిహారంతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.20 వేల ఇప్పిస్తామని అటవీ శాఖ అధికారి ఎన్ ప్రధాన్ తెలిపాడు.

Also Read: పలు రికార్డులు బద్దలు కొట్టిన జైస్వాల్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News