- Advertisement -
రిషికేష్ : రాజాజీ పులుల సంరక్షణ కేంద్రంలో మోటిచూర్ రేంజిలో శనివారం నాడు గూడ్సు రైలు ఢీకొని నాలుగేళ్ల వయసున్న ఏనుగు పిల్ల మృతి చెందింది. ఈ సంఘటన మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో జరిగిందని పులుల సంరక్షణ కేంద్రం డైరెక్టర్ ధర్మేష్ కుమార్ సింగ్ చెప్పారు. రైలు పట్టాలపై కొన్ని మీటర్ల దూరంలో ఏనుగుల మంద ఉండగా, డ్రైవర్ రైలు వేగాన్ని తగ్గించాడు. హారన్ కూడా మోగించాడు. గూడ్సురైలు స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి ఏనుగుల మంద లోని చాలా ఏనుగులు పట్టాలను దాటేశాయి. అయితే ఏనుగు పిల్ల మాత్రం వెంటనే అక్కడ నుంచి కదల లేక పోయింది. చక్రాల కింద పడి అక్కడికక్కడే చని పోయింది. గూడ్సు పైలట్ పై వన్యమృగ సంరక్షణ చట్టం కింద కేసు నమోదయింది
- Advertisement -