Saturday, January 11, 2025

ఏనుగు దంతం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఏనుగు దంతం విక్రయించేందుకు యత్నించిన వ్యక్తిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి ఏనుగు దంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…బండ్లగూడకు చెందిన ఎండి రెహాన్ అలియాస్ దీపక్ తాపా బీఫ్ షాప్‌ను నిర్వహిస్తున్నాడు. నేపాల్‌కు చెందిన దీపక్ బతుకు దెరువు కోసం కుటుంబంతోపాటు ఇండియాకు వచ్చాడు. ఇక్కడ బీఫ్ షాపు నిర్వహిస్తున్న దీపక్ ముస్లిం మతంలోకి మారాడు.

షాపు నిర్వహిస్తున్నా ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో తనకు పరిచయమైన వ్యక్తి వద్ద ఏనుగు దంతం కొనుగోలు చేశాడు. దానిని రూ.15లక్షలకు విక్రయించేందుకు యత్నిస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ అనిల్‌కుమార్, ఎస్సైల షేక్‌బురాన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News