Wednesday, January 22, 2025

చిత్తూరు జిల్లాలో విషాదం.. దంపతులను తొక్కి చంపిన ఏనుగు

- Advertisement -
- Advertisement -

చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. మంగళవారం గుడిపాల మండలం 190 రామాపురం హరిజనవాడ గ్రామ శివారులో భార్యాభర్తలు వెంకటేష్, సెల్విలపై ఒంటరి ఏనుగు దాడి చేసింది. పొలంలో పనిచేస్తున్న దంపతులను తొక్కుతూ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్తులు వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఏనుగు దాడి చేస్తుండడంతో దగ్గరికి వెళ్లేందుకు భయపడి పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఏనుగును అక్కడి నుంచి తరిమారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News