Monday, December 23, 2024

హైవేపై గజరాజు రౌడీ మామూలు (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: రోడ్డుపై వెళ్లే భారీ వాహనాల నుంచి డబ్బులు వసూలు చేసే అధికారుల గురించి మనకు తెలుసు..కాని టోలు ట్యాక్సు కలెక్టర్ అవతారమెత్తిన ఒక ఏనుగు గురించి మీకు తెలుసా..అయితే ఈ వీడియో మీరు చూసెయ్యండి. రోడ్డుపై వెళుతున్న లారీలను అడ్డగించి మరీ నుంచి చెరకు గడలను లంచంగా పుచ్చుకుంటున్న ఒక ఏనుగుకు సంబంధించిన వీడియోను డాక్టర్ అజయిత అనే యూజర్ ట్విటర్‌లో షేర్ చేశారు. క్రషింగ్ కోసం షుగర్ ఫ్యాక్టరీలకు చెరకు గడలతో వెళుతున్న లారీలను హైవేపై ఆపి మరీ చురకు గడలను లాక్కుని పంపిస్తున్న ఏనుగును ఈ వీడియోలో చూడవచ్చు. వీడియోలో కనిపిస్తున్న సైన్ బోర్డును బట్టి ఈ వీడియోను థాయ్‌ల్యాండ్‌లో తీసి ఉండవచ్చని అర్థమవుతోంది. 3 లక్షల మందికి పైగా నెటిజన్లు వీక్షించిన ఈ వీడియో వైరల్ అవుతోంది. రౌడీ మమూలు వసూలు చేసినట్లు ఆ ఏనుగు చెరకు గడలను వసూలు చేయడం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News